Jump to content

Recommended Posts

Posted

బీజేపీ తొలి బడ్జెట్ సామాన్యుడి సెంట్రిక్ గా కాకుండా దేశానికి ప్రాధాన్యమిచ్చి రూపొందించారు. ఈరోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల ప్రవేశ పెట్టిన బడ్జెట్ విశేషాలను గుల్టే పాఠకుల కోసం ప్రత్యేక వర్గీకరణతో ఇస్తున్నాం.

సామాన్యుడికి :
* ఆదాయ పరిమితి రూ.50 వేలు పెంచి రెండున్నర లక్షలు చేశారు.
* పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు
* సీనియర్ సిటిజన్ల ఆదాయపు పన్ను పరిమితి మూడు లక్షలు
* ప్రతి ఇంటికి రెండు బ్యాంకు ఖాతాల ఉండేలా చర్యలు
* ఆడపిల్లల సంక్షేమం, చదువుకు అధిక ప్రాధాన్యం
* ఆన్లైన్లో పాఠాలు
* నిరంతరం కరెంటు సరఫరా
* అన్ని స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు
* ప్రతి గ్రామానికి మంచినీరు (దీర్ఘకాలిక లక్ష్యం)
* తక్కువ వడ్డీకి గృహ రుణాలు
* నైపుణ్యాలు పెంచే స్కిల్ ఇండియా ప్రోగ్రాం
* 9 విమానాశ్రయాల్లో ఈ -వీసా
* మరో 60 ఆదాయపు పన్ను కేంద్రాలు
* గృహ రుణాల వడ్డీ
* కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, చెప్పులు, ఇనము, వజ్రాలు, పెట్రోలు, టీవీలు,
* ధరల స్థిరీకరణ నిధి
* తక్కువ ధరలకే ఇళ్ల నిర్మాణం
* విమెన్ సేఫ్టీకి ఐదు వందల కోట్లు

రైతులకు :
* ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం
* మూడు శాతం వడ్డీతో పంట రుణాలు
* రైతుల కోసం కిసాన్ టీవీ,
* భూమిలేని రైతులకు ఆర్థిక సాయం
* రైతులందరికీ భూ నాణ్యత కార్డుల మంజూరు
* రైతులకు వర్షాధారం మీదే కాకుండా ప్రతి పొలానికి నీరు పథకం
* భూసార పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక నిధులు
* అన్ని పట్టణాల్లో రైతు మార్కెట్లు
* నేరుగా ఎరువుల సబ్జిడీ రైతులకే అందే ఏర్పాట్లు
* మరిన్ని గోదాముల ఏర్పాటు
* కొత్త యూరియా పాలసీ

ఆంధ్రాకు :
* ఎయిమ్స్ కేటాయింపు. తొలి విడతలో 500 కోట్లు
* ఐఐటీ కేటాయింపు
* వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
* హిందూపురంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడెమీ ఏర్పాటు
* ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా కృష్ణపట్నం
* విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్
* కాకినాడలో హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంపై ప్రత్యేక శ్రద్ధ
* రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ

తెలంగాణకు:
* రెండొందల కోట్ల ఉద్యాన విశ్వవిద్యాలయం
* హైదరాబాదులో రుణాల వసూళ్లకు ట్రిబ్యునల్
* రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ

దేశానికి :
* దేశంలో వంద స్మార్ట్ సిటీలు-వాటికి ఏడువేల కోట్లు
* దేశంలో ఏడు పారిశ్రామిక నగరాలు
* ఏ, బి క్లాస్ సిటీల్లో విమానాశ్రయాలు
* లక్నో, అహ్మదాబాద్ లకు మెట్రో రైళ్లు
* గయ నగరం అంతర్జాతీయ పర్యాటక నగరంగా తీర్చిదిద్దడం
* బ్యాంకుల్లో ప్రభుత్వం రెండున్నరల లక్షల కోట్ల పెట్టుబడి
* గ్రామీణ రోడ్లకోసం 15000 కోట్ల రూపాయలు
* వంద కోట్లతో క్రీడా విశ్వవిద్యాలయం
* ఆసియా క్రీడల కోసం వంద కోట్లు
* అమర జవాన్ల సృతి వనం నిర్మాణానికి వంద కోట్లు
* గంగానది ప్రక్షాళనకు రెండు వేల కోట్లు
* తమిళనాడు, రాజస్థాన్ లో సౌర విద్యుత్తు ఏర్పాటుకు 500 కోట్లు
* నదుల అనుసంధానం ప్రాజెక్టు అధ్యయనం షురూ!
* మెరుగైన నీటిపారుదల ప్రణాళికలు, వెయ్యి కోట్ల కేటాయింపు
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విమానాశ్రయాల అభివృద్ధి.
* నేషనల్ హైవేల అభివృద్ధికి 37800 కోట్లు
* నౌకాశ్రయాల అనుసంధానం
* పదిహేను వేల కిలోమీటర్ల గ్యాస్ పైపులైను ఏర్పాటు,
* చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం
* గ్రామాలకు ఇంటర్నెట్, టెక్నాలజీ చేరవేతకు ఏర్పాట్లు
* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు
* అన్ని ఈశాన్య రాష్ట్రాలకు రైళ్లు
* ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక టీవీ ఛానెల్
* నేషనల్ హిమాలయన్ స్టడీస్ సెంటరు ఏర్పాటు
* గృహ రుణాల వడ్డీ తగ్గింపు, పన్ను రాయితీ రెండు లక్షలకు పెంపు
* కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, చెప్పులు, ఇనము, వజ్రాలు, పెట్రోలు, టీవీల ధరలు తగ్గుతాయి

Posted

* తమిళనాడు, రాజస్థాన్ లో సౌర విద్యుత్తు ఏర్పాటుకు 500 కోట్లు

 

Idi Ap lo vasthadi annaru gaa

×
×
  • Create New...