Jump to content

Recommended Posts

Posted

ఉప్పు సత్యాగ్రహం చేసుంటే ఉప్పు అమ్ముతామంటున్న ప్రభుత్వం?

 

 

సుబ్బారావ్‌ పక్కనున్న కిరణా కొట్టుకెళ్ళాడు, ఉప్పు ఇవ్వమని అడిగి జేబులోనుంచి పదిరుపాయిలు తీసి పట్టుకున్నాడు.షాప్‌ వాడు ఏదో అడిగాడు, సుబ్బారావ్‌ ఆశ్చర్యపడి వాడి మొహం చూస్తూ, అర్థం కానట్లు మళ్ళీ అడిగాడు. విన పడదా అన్నట్లు విసుక్కుంటు మళ్ళీ చెప్పాడు షాప్‌ వాడు.

“మీ తాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటేనే, ఉప్పు అమ్ముతాం, సత్యాగ్రహం చేసుంటే చూపించు, ఉప్పు ఇస్తా!” అన్నాడు షాపు వాడు
“ఇదెక్కడి దిక్కుమాలిన రూలు నేను వినలేదు…” ఇంకా ఏదో అనబోయాడు సుబ్బారావ్‌, షాపు వాడు మధ్యలో ఆపి..
“నోరు జాగ్రత్త!, మా నాయకుడు నిన్నే చెప్పాడు, వుంటే చూపించు లేకపోతే పో!…”
“నీ షాపు కాక పోతే… పక్క షాపులో తీసుకుంటా…” (నీకొక్కడికే వుందా బోడి షాపు మనసులో అనుకుంటూ…), కోపంగా అన్నాడు సుబ్బారావ్‌

“పక్క షాప్‌ కాదు, ఊరు మొత్తం ఒక్కడు నీకు ఉప్పు అమ్మడు…” ధీమాగా అన్నాడు షాపు వాడు
“అంటే అందరూ మీ నాయకుడు చెప్పిందే వినాలా?, ఎవరూ ప్రశ్నించరా” ఊర్లో ఉప్పు దొరక్క పోతే తన పరిస్థితి ఏంటని, కాస్త స్వరం తగ్గించి అడిగాడు సుబ్బారావ్‌
“హైద్రాబాద్‌లో 1956 ముందున్న వాళ్ళకి మాత్రమే ఫిజు Reimbursement అంటే ప్రశ్నించావా?, మరి మా ఊర్లో మా నాయకున్ని ప్రశ్నిస్తున్నావ్‌…” Logic ప్రయోగించాడు షాపు వాడు

సుబ్బారావ్‌కి ఏమి చెప్పాలో అర్థం కాక చేతిలో పట్టుకున్న పది రూపాయిల నోట్‌ని నలుపుతూ ఆలోచించాడు.

“నేనెందుకు ప్రశ్నిస్తా, నా పిల్లలు చదువులై పోయి హాయిగా అమెరికా లో సెటిలై వున్నారు…” దానికీ దీనికి లింకేటన్నట్లు సమాధానం చెప్పాడు సుబ్బారావ్‌
“షాప్‌లో గొడవ చేయకుండా, ఉప్పు సత్యాగ్రహం చేసుంటే ఉప్పు తీసుకెళ్ళు, లేక పోతే షాప్‌ (ఊరు) ఖాళీ చేయి…” అన్నాడు షాపు వాడు
“అంటే క్విట్‌ ఇండియాలో పాల్గొనక పోతే, ఇండియా నుంచి పొమ్మంటారా?” తనకీ Logic వుందని చూపించాడు సుబ్బారావ్‌
“మా నాయకుడు చెప్తే అంతే, ఊరు నుంచి కూడా Packers and Movers ని మాట్లాడి మరీ పంపుతాం” మా నాయకుడి మాటకి ఎదురుండదు అన్నట్లు చెప్పాడు షాపు వాడు

ఊప్పు అమ్మకపోతే, “మందు Ban” వున్నప్పుడు పక్క రాష్ట్రాంలో తెచ్చుకుని తాగి తరించి నట్లు, పక్క ఊరు నుంచి ఉప్పు తెచ్చుకొని బ్రతకొచ్చు, కానీ ఊరు నుంచి పొమ్మంటే ఈ వయసులో ఎక్కడికి పోవాలని సుబ్బారావ్‌ అక్కడనుంచి కదిలాడు.

భారత దేశంలో అందరికి ఒకటే పౌరసత్వం, ఒకే పాస్‌పోర్ట్‌ వుంటే మన ఊరి నాయకుడు ఇలాంటి రూల్స్‌ పెట్టడం ఏంటని ఆలోచించుకుంటూ ఇంటికెళ్ళాడు. భార్య ఉప్పేదని అడిగితే,

“ఉప్పు తరువాత ముందు మన నాన్న, తాతల చరిత్ర తెలుసుకోవాలి, ఎక్కడ పుట్టారు, ఏ సత్యాగ్రహం చేసారు, ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, జైలు కెళ్ళారా, కనీసం లాఠీ దెబ్బలైనా తిన్నారు… అంతా తెలుసుకుంటేనే ఈ ఊర్లో మనకి ఉప్పు, పప్పు, అన్నం దొరుకుతుందా లేదా అని తెలుస్తుంది” అంటూ కుర్చీలో కూలపడ్డాడు. భార్యకేమీ అర్థం కాక పక్కింట్లో ఉప్పు తీసుకుందామని వెళ్ళింది.

గోడ మీద సుబ్బారావ్‌ వాళ్ళ నాన్న ఫొటో చూస్తూ… నేనిక్కడ పుట్టాను, మా నాన్న పక్క రాష్ట్రాంలో పుట్టాడు, వాళ్ళ నాన్న ఎక్కడ పుట్టాడో తెలియదు. నా కొడుకు అమెరికా లో పుట్టక పోయినా అక్కడ హాయిగా వున్నాడు, నన్ను ఈ ఊరు నుంచి పొమ్మంటే ఏ ఊరు కెళ్ళడం మంచిదా అని కళ్ళు మూసుకొని ఆలోచుస్తూ కూర్చున్నాడు.

 

Posted

2w2r5gm.jpg

Posted

ma nayakudu ki badulu maa lafangi ante saripoyedi.. sani vedava

2w2r5gm.jpg

×
×
  • Create New...