mukunda1 Posted July 15, 2014 Report Posted July 15, 2014 Ice cream రివ్యూలకి సంబందించి గ్రేట్ ఆంధ్రా మరియు ఆ రకం ఇతర జీవులకి ఇది నా లేఖ. ఎవరో నాకు గ్రేట్ ఆంధ్రా రాసిన ఐస్ క్రీం రివ్యూని పంపారు. ఆ రివ్యూవర్ కి, వాడిలాంటి మిగతా రివ్యూవర్లకి నా మీద ఉన్న ద్వేషాన్ని చూసి నేను నవ్వలేదు.... ఏడ్చాను... ఎందుకంటే వాళ్ల మీద జాలితో. కానీ ఇంకో విధంగా ఆలోచిస్తే సినిమా ఎలా తియ్యాలో ఎలా తియ్యకూడదో వాడి నుంచి నేర్చుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. ఒక కెమెరాకి తలెక్కడో తోకెక్కడో కూడా తెలియకపోవడమే కాకుండా ఆ వెబ్ సైట్ లో వాడికి ఉద్యోగం లేకపోతే, ఒక ప్రొడక్షన్ యూనిట్ లో టీ-బాయ్ గా ఉండే అర్హత కూడా ఉండదనేది నా అభిప్రాయం కాదు, నమ్మకం... అసలు ఐస్ క్రీం లో తప్పులేంటో, ఏలా తీసుండొచ్చో, ఎలా తీసుండకూడదో నాకు చెప్పటానికి దమ్ముంటే వాడు నాతో ఒక టివిఛానల్ లో లైవ్ డిబేట్ కి రావాలని నా ఓపెన్ చాలెంజ్. అప్పుడు కాని సినిమా పరిజ్ఞానంలో వాడు ఎంత వెంగళప్పో జనాలకి అర్ధమవ్వదు. నాతో ఓపెన్ టివి డిబేట్ కి ఒప్పుకోకపోతే వాడు నాకు చీకట్లో అరిచే కుక్కతో సమానం. నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్. కేవలం ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసి నోటికొచ్చినట్టు వాగటమే రివ్యూ అయితే సినిమా చూసిన ప్రతివాడు రివ్యూయరేగా. కాని కేవలం ఒక మ్యాగజైన్ కో, వెబ్ సైట్ కో పనిచేయడం మూలాన రివ్యూయర్ మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రేక్షకుడిగా ఫీల్ అవుతాడు. నాకు తెలిసి చాలామంది సమీక్షకుల ద్వేషం నా సినిమాలకన్నా నా మీదే. అడిగితేఅందులో కొందరు, మీ మీద ప్రేమ, ఇష్టం వల్ల మిమ్మల్ని ఉధ్ధరించడానికే ఇలా స్పందిస్తున్నాం అంటారు. కానీ ఆ సో కాల్డ్ ప్రేమని ఈమధ్య నేనొక ఎలర్జీలా ఫీల్ అవుతున్నాను.. నేను నా ఇష్టం వచ్చినట్టు ఎవర్నీ పట్టించుకోకుండా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లిపోతున్నాననే కుళ్లులోంచి పుట్టిన పగే వాళ్ల ఆ సో కాల్డ్ ప్రేమ కి అసలు కారణం. సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్ మొదలైన అంశాల సమ్మేళనం. ఆ సమ్మేళనం ఒక డైరెక్టర్ చేతిలో తన సెన్సిబిలిటీలో ఉంటుంది. ఆ సెన్సిబిలిటీకి కనెక్ట్ అవ్వనప్పుడు సినిమా నచ్చక పోవచ్చు. సినిమా హిట్టా, ఫ్లాపా అని విశ్లేషించడానికి 3కారణాలుంటాయి. ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత రికవర్ అయ్యింది అనేది. ఎంతకి కొన్నారు, ఎంత వచ్చింది అనేది.. ఆ తరువాత ఒక ప్రేక్షకుడు ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాడు అనేది. పది మందిని అడిగితే పది రకాల అభిప్రాయాలు చెబుతారు. కానీ పేరు పేరున వేలమంది ఆడియన్స్ ని అడగలేం కనుక కాస్ట్ వర్సెస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ఒక సినిమాకి కరెక్ట్ కొలబద్ద. వ్యక్తిగతంగా కొందరికి సూపర్ హిట్ సినిమా కూడా నచ్చకపోవచ్చు. కొందరికి సూపర్ ఫ్లాప్ సినిమా కూడా నచ్చొచ్చు. కానీ చివరికి బాక్సాఫీస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం ఓనమాలుతెలిసినోడైనా చెబుతాడు. పాటలు, స్టార్లు, ఫైట్లు, కామెడీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ఐస్ క్రీం అనే సినిమాకి సూపర్ ఓపెనింగ్ రావడమే అందరికి షాక్ ఇచ్చింది. దీని మూలాన నేను ప్రూవ్చేసిందేంటంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని... ఐస్ క్రీం కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు. నేను ఐస్ క్రీం లో ప్రవేశ పెట్టిన ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీ మున్ముందు ఒక ప్యారెలెల్ ఇండస్ట్రీని సృష్టిస్తుందని నా ప్రెడిక్షన్. నేను ఐస్ క్రీం లో ఇంట్రొడ్యూస్ చేసిన హై కాన్సెప్ట్-లో బడ్జెట్ ప్యారెలల్ సినిమా గాని, గింబల్ రిగ్ గాని ఎప్పటికీ ఉండిపోతాయి. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేనిక్కడ రాసింది చదివి వాళ్లు చేయగలిగేది కేవలం నా మీద ఇంకారెట్టించిన ద్వేషంతో రెచ్చిపోయి రాయడం. . నేను ఏనుగుని కాకపోవచ్చు కానీ ఆ సమీక్షకుడు మాత్రం ఖచ్చితంగా ఒక కుక్క. సింహం గర్జిస్తే భయపడతానేమో గానీచీకట్లోంచి మొరిగే కుక్క నాకు కేవలం చిరాకు తెప్పిస్తుంది... ఆఖరి మాటగా నేను చెప్పేదేంటంటే నేనిక్కడ రాసిందంతా కోపంతోనో ఆవేదనతోనో కాదు, కేవలం చిరాకుతో. -రాం గోపాల్ వర్మ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ link - https://www.facebook.com/RGV/posts/318706424954096
mukunda1 Posted July 15, 2014 Author Report Posted July 15, 2014 Ram Gopal Varma @RGVzoomin · 12h Ppl at 6tV intrvw trying 2 protect evn real name of great andhra reviewer who's refusing to come on a live debate ..thats the undrwrld way
mukunda1 Posted July 15, 2014 Author Report Posted July 15, 2014 enni sarlu vestar ba naaku teliyadu repost ani.......but too funny baa.......
kirak_kiran Posted July 15, 2014 Report Posted July 15, 2014 gasss andhraa ichina review 0/5 anta hahaha
JollyBoy Posted July 15, 2014 Report Posted July 15, 2014 naaku teliyadu repost ani.......but too funny baa....... nijame.. mari eedu anaevadu kada.. nachithe choodandi.. lekapothe ledu ani... veedu kuda review nachite chadvamanu.. lekapothe ledu
JollyBoy Posted July 15, 2014 Report Posted July 15, 2014 gasss andhraa ichina review 0/5 anta hahaha maya ekaduntav.. ee peru vinna anduke asking
xxxmen Posted July 15, 2014 Report Posted July 15, 2014 Naku vadu rase review lu bhayani kadu chikaku ni tepistay
JollyBoy Posted July 15, 2014 Report Posted July 15, 2014 Naku vadu rase review lu bhayani kadu chikaku ni tepistay GAs gadu edave... but vadi business ey adi..
mukunda1 Posted July 15, 2014 Author Report Posted July 15, 2014 nijame.. mari eedu anaevadu kada.. nachithe choodandi.. lekapothe ledu ani... veedu kuda review nachite chadvamanu.. lekapothe ledu RGV ni emanaku bhayya........nenu koncham fan aadiki. but aadi reaction to gas andhra too much funny....asalu oka dialogue andulo. సింహం గర్జిస్తే భయపడతానేమో గానీచీకట్లోంచి మొరిగే కుక్క నాకు కేవలం చిరాకు తెప్పిస్తుంది
xxxmen Posted July 15, 2014 Report Posted July 15, 2014 GAs gadu edave... but vadi business ey adi.. Varma gade andarki chikaku tepistadu, kani varma ke chikaku tepinchadu ante adidi mamulu gas kadu, gobar gas a
mukunda1 Posted July 15, 2014 Author Report Posted July 15, 2014 Baga esukunnadu LoL.1q nuvvu kuda GA ghost writer ani agraharam lo talk bhayyoo.....
Recommended Posts