siru Posted July 15, 2014 Report Posted July 15, 2014 అనుష్కకి అవకాశాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. కొన్ని పాత్రలకి, కొన్ని రకం సినిమాలకి తను తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించక దర్శకులు అనుష్కతోనే బాహుబలి, రుద్రమదేవిలాంటివి తీస్తున్నారు. ఇలాంటి సినిమాల్లో తాను ధరించే కాస్టూమ్స్ వల్ల అనుష్క వయసు వాటికి పెద్ద సమస్య కావడం లేదు. కానీ గ్లామర్ ప్రధానమైన పాత్రల్లో మాత్రం అనుష్క తేలిపోతోంది. తన వయసుని అసలు దాచలేకపోతోంది. మిర్చి సినిమాలో ప్రభాస్ కంటే చాలా ఏజ్డ్‌గా కనిపించిందని ఆమె గురించి విమర్శలు వచ్చాయి. అయినా కానీ ఇప్పటికీ అనుష్కకి అవకాశాలు తగ్గలేదు. రీసెంట్‌గా ఆమె గౌతమ్ మీనన్ సినిమాలో అజిత్ సరసన అవకాశాన్ని తగ్గించుకుంది. గౌతమ్ మీనన్‌కి హీరోయిన్లని అందంగా చూపిస్తాడనే గుర్తింపు ఉంది. అయితే ఈ చిత్రంలో అనుష్కని తనదైన శైలిలో కాకుండా గ్లామరస్‌గా చూపిస్తున్నాడు. అనుష్క ఆ క్యారెక్టర్‌కి సూట్ అయినట్టు కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న స్టిల్ ఆ సినిమాలోనిదే. అనుష్క ఎంతగా ముదిరిపోయిందో ఈ స్టిల్ చూసి తెలుసుకోవచ్చు. ఫోటోల్లోనే దాచలేకపోతున్న వయసుని తెరపై ఎలా దాస్తుందో... ఈ లోటుని ఏ విధంగా భర్తీ చేసి ఇంప్రెస్ చేస్తుందో మరి.
Recommended Posts