Jump to content

Recommended Posts

Posted

జగన్ వెంట కోర్టుకి వెళితే డబ్బులు ఇస్తారు అంట!

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నాంపల్లి సిబిఐ కోర్టు కు హాజరు అయ్యారు .. జగన్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి, గీతారెడ్డితో సహా చార్జిషీట్లలోని పది మంది నిందితులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఇంకా జైలులో ఉన్న కొంత మంది ఓఎంసీ నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది.

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఆగష్టు 11కు వాయిదా వేయటం జరిగింది.

జగన్ కోర్టుకు వచ్చిన సమయంలో ఆయనను కలుసుకునేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.. కానీ అసలు విషయం ఏమిటంటే అభిమానులు, కార్యకర్తలు కొంత మంది వస్తే మరి కొందరిని తరలించారు అంట .. జగన్ కోసం జైలు కి వస్తే రెండు వందలు ఇస్తామన్నారు అందుకే వచ్చాము అని కొందరు చెప్పటం విశేషం .

రాజకీయ నాయకులు నిర్వహించే పార్టీ సభలకు, ర్యాలిలకు జనాలను తరలిస్తారు అనే సంగతి అందరికి తెలిసిన విషయమే .. కానీ నాయకులు కోర్టుకు హాజరు అయ్యేటప్పుడు కూడా జనాలను తరలిస్తారు అన్న విషయం కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.

 

×
×
  • Create New...