Jump to content

Small Story On Money Vs Family


Recommended Posts

Posted

10557393_668766793172722_753136541878508

 

హైదరాబాదు నగరంలో దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఓ వ్యక్తి సమీప గ్రామం నుంచి రోజూ సైకిల్ మీద పాలు తెచ్చుకొని అమ్ముతూ ఉండేవాడు. అలా, అలా పాలు అమ్ముకుంటూ కొన్నాళ్ళకు నగరం నడిబొడ్డున ఓ ప్రాంతంలో కొంత స్థలం కొనుక్కున్నాడు. అదేవిధంగా పాడి వలన పెరిగిన ఆదాయంతో రాజధాని శివార్లలో ఎన్నో ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశాడు. హైదరాబాదులోని ప్రముఖ వ్యాపార ప్రాంతంలో పూర్వం తను కొనుగోలు చేసిన స్థలంలో పెద్ద హొటలు కూడా కట్టాడు. ఇలా సంపద విస్తరణ రుచి మరిగిన సదరు పాలవ్యాపారి కొన్నాళ్ళకు శ్రీమంతుడిగా మారిపోయాడు.

ఇరవై ఏళ్ళ తరువాత ఒక్కసారిగా భాగ్యనగరంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆయన భూముల విలువ వందలరెట్లు పెరిగిపోయింది. లక్షల్లో ఉన్న ఆ వ్యాపారి సంపద వందల కోట్లకు చేరిపోయింది. అప్పటినుంచే ఆయనకు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. అన్ని రోజులుగా సఖ్యతతో ఉన్న కుమారుల, కుమార్తెల మనస్సుల్లో విభేదాలు పొడసూపాయి. ఆత్మీయతల స్థానంలో అంతఃకలహాలు చెలరేగాయి. భూముల విస్తరణపై పెట్టిన దృష్టి, ఆయన బంధాల పటిష్ఠతపై పెట్టకపోవడంతో కన్నబిడ్డలు కసాయిల్లా మారిపోయారు. ఒకరిపై మరొకరు కత్తులు నూరుకునే స్థాయికి చేరుకున్నారు.

చివరకు ఒకానొక రోజు ఆ పెద్దమనిషి కళ్ళముందే తీవ్ర ఘర్షణలకు పాల్పడి, తుదకు ఆయననే కత్తితో పొడిచి అంతమొందించారు. పాపలా పెంచిపోషించుకున్న ధనమే తనను పాములా కాటేసింది. ఇలా అర్థము (డబ్బు) ఎంతటి అనర్థాన్ని తెస్తుందో ముందే ఊహించి ఉపదేశించారు దార్శనికులైన ఆదశంకరాచార్యులు. ఆ పరంపరలో ఆ పరమాచార్యులు తన ’భజగోవిందం’లో ఇలా అంటారు:

అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యమ్!
పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్త్రైషా విహితా రీతిః!!

’ధనం ఎల్లప్పుడూ అనర్థాన్నే కలిగిస్తుందని గ్రహించు.ధనం వల్ల సుఖం లేశమైనా లేదు; ఇది సత్యం. ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడతారు. ప్రపంచమంతా ఈ రీతిగానే ఉంద’ని హితవు పలుకుతున్నారు.

నేడు సమాజంలో ధనకాంక్ష మనిషిని ఎంత దిగజారుస్తుందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఎందుకింత స్వార్థంతో కోట్లకు కోట్లు కూడబెడుతున్నారో, ధనదాహంలో పడి కొట్టుకుపోతున్నారో అర్థం కావడం లేదు. కళ్ళముందు ఆ పాలవ్యాపారిలాంటి ఉదంతాలు కోకొల్లలుగా జరుగుతున్నా కళ్ళు తెరవడం లేదు.
Posted

Uncle pitta kathalu eppati nundi modalettav


gallery_24383_15_147101.gif

 

apudu appudu adhyatmikam kuda undali.. manishi anna tarwata..

Posted

apudu appudu adhyatmikam kuda undali.. manishi anna tarwata..


Vakey
Posted

Uncle pitta kathalu eppati nundi modalettav


gallery_24383_15_147101.gif

 

 

apudu appudu adhyatmikam kuda undali.. manishi anna tarwata..

LOL gallery_24383_15_147101.gif

Posted

uncle nee salary donate cheyi 50%..em chesukuntnav anthagallery_24383_15_147101.gif

Posted

apudu appudu adhyatmikam kuda undali.. manishi anna tarwata..

 

sooper...brahmi%20laugh.gif

×
×
  • Create New...