Jump to content

Recommended Posts

Posted

Repost ayithe kshaminchandi..chetta joke ayithe manninchandi..

 

మన హీరోలు పరీక్ష రాయటానికి వచ్చారు. వచ్చి
ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు.
పరిక్ష మొదలైన 10 నిమిషాల తరువాత
వచ్చాడు మహేష్ బాబుv
ఏంటి బాబు లేట్ అంటే ..
*మహేష్:* ఎప్పుడు వచ్చామని కాదు అన్నయ్య
పరీక్ష రాశామా లేదా ..? అని వెళ్ళి
కూర్చున్నాడు.
(వెనకున్న చిరంజీవి బ్రదర్ ఇది తీసుకో అని
స్లిప్ ఇచ్చాడు
మహేష్ థాంక్స్ చెబితే)
*చీరంజీవి:* థాంక్స్ కాదు బ్రదర్ ఆ స్లిప్
ను మూడు చేసి ముగ్గురికి ఇవ్వు, ఆ
ముగ్గురుని ఇంకో ముగ్గురకు ఇవ్వమని
చెప్పు అలా మొత్తం స్లిప్ లు మయం చేయండి.
(అనగానే పక్కనే వున్న రామ్ చరణ్ అందుకుని)
*రామ్ చరణ్: *ఒక్కొకటి కాదు నాన్న, వంద
స్లిప్పులు ఒక్కసారి పంపించు 300
వందలమందికి పంచుతా..
(అని కూర్చున్నాడు. అప్పుడు సాయికుమార్
వచ్చి)
*సాయికుమార్: *కనిపించే మూడు పేపర్లు ..
OMR పేపర్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్
పేపర్ అయితే కనిపించని ఆ నాలుగో పేపరేరా
స్లిప్...స్లిప్...స్లిప్.
(అని తన స్లిప్ తను తీసుకుని
కూర్చున్నాడు.)
స్లిప్ప్పులు ఎక్కువై కోపం వచ్చిన
బాలకృష్ణ
*బాలకృష్ణ:* ఒరేయ్ .. నేను కాపీ
కొట్టడం మొదలుపెడితే.... ఏ ప్రశ్నకి ఏ జవాబు
రాసానో కనుక్కోవడానికి వారం పట్టిద్ది. మర్యాదగా
ఏ ప్రశ్నకు ఏ స్లిప్పో సరిగ్గా
చెప్పండి.
మరోపక్క స్లిప్పులు దొరక్క ఎగబడుతున్న
వాళ్ళను పక్కకు నెట్టిన ప్రభాస్
*ప్రభాస్: *వాడు పొతే వీడు, వీడు పొతే నేను,
నేను పొతే నా అమ్మామొగుడు అని
ఎవరైనా స్లిప్ కోసం ఎగబడితే ... దెబ్బకో తలకాయ్
చొప్పున బెంచిలకి బలవుతాయి
అని స్లిప్పు తెచ్చుకు రాసుకుంటున్నాడు.
యన్.టి.ఆర్ బుద్దిగా తన
స్లిప్పు తను రాసుకుంటుంటే ఎవడో వచ్చి
స్లిప్పు
లాక్కోబోతే వాడి చెయ్యి గట్టిగా పట్టుకుని
*జూ|| యన్.టి.ఆర్ : *రేయ్... సాఫ్ట్ గా లవర్
బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటూన్నవేమో
... లోపల ఒరిజినల్ అలాగే ఉంది.
స్లిప్పు వదల్లేదో ..... రచ్చ..రచ్చే..!
(అన్నాడు. ఈ లోపు ఎగ్జామ్ స్క్వాడ్ వచ్చి
పేపర్లు లాక్కుని అందరినీ బయటకు
పంపారు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా...అని
అందరు ఆలోచిస్తుంటే, అందరికన్నా చివరన
వచ్చాడు రవితేజ )
*రవితేజ: *ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారా.. అనేగా
మీ డవుటు.... నేనే...ఇచ్చా...!
ఊరికినే కాపీ కొడితే.... కిక్ ఏముంది నా
అప్పడం. అందుకే స్క్వాడ్ ను పిలిచా..!

Posted

"ఒరేయ్!ఎంటిరా...మీ ఆవిడ పుట్టిన రోజు కి డయమండ్ సెట్ ఇచ్చావట!!...నిజమేనా ??!" అడిగాడు "ఎసిడిటీ" గాడు !

"అవునురా !!తను కారు అడిగింది....కార్ ఎండుకూ, డయమండ్ సెట్ ఇస్తాను అన్నాను....హహహ ...ఎగిరి గంతేసింది!!" అన్నాడు "హైపర్ ఎసిడిటీ" గాడు!

"బాప్రే!! చాలా ధైర్యం చేసావు!!" అన్నాడు "ఎసిడిటీ" గాడు !

"దీన్లో ధైర్యం ఏముందీ??....డైయమండ్ సెట్ అయితే, మనం డూప్లికెట్ ది ఇవ్వచ్చు, కానీ కార్ డూప్లికెట్ ది ఇవ్వలేముగా!!" అన్నాడు "హైపర్ ఎసిడిటీ" గాడు!

Posted

"ఇంజేనీరిగ్ కాలేజీ ప్రొఫెసర్లు ఒక విమానం ఎక్కారు!!"

పైలట్ వచ్చి,"ముందుగా మీకు వెల్కం !!నేను, మీరు అన్దరూ గర్వ పడే ఒక విషయం చెబుతాను!!
ఈ విమానం మీ కాలేజీ విద్యార్థులు తయారు చేసిందే ...ఈ రోజే ఈ విమానం మొదటి ప్రయాణం!!" అన్నాడు.

అంతే!!...అన్దరూ బిల బిలా మంటూ విమానం లోంచి దిగిపోయారు!!

ఒక ప్ర్ఫేసర్ గారు మాత్రం , తొణక కుండా పేపర్ చదువు కుంటూ, కూర్చునె వున్నాడు !!

"గుడ్! మీ ధైర్యానికి నా జోహారు!" అన్నాడు పైలెట్ !

"ధైర్యమా నా బొందా??!!...ఈ విమానం స్టార్ట్ అవదు, నాకు తెలుసు!!" అన్నాడు ప్రొఫెసర్ జీ!!   :) 

Posted

నైపుణ్యం:
"మగాడిని లొంగదీసుకునే నైపుణ్యం ఆడవారి చేతి వంటల్లోనే ఉంది. వంట చక్కగా రుచికరంగా చేసే స్త్రీ అంటే ఎటువంటి మొనగాడైనా పడి ఛస్తాడు.." అన్నది సుబ్బమ్మ.
"ఓహో ! అయితే ఇప్పుడర్ధమైంది", సాలోచనగా అంది లక్ష్మి.
"ఏమర్ధమైంది?" అని అడిగింది సుబ్బమ్మ.
"మా ఆయన ఆరేళ్ల క్రితం మా వంటమనిషితో ఎందుకు లేచిపోయాడా అని"..తల పైకీ కిందికీ ఊపుతూ అన్నది లక్ష్మి.
(ఇది జంధ్యాల జోక్)

Posted

నాగార్జున గారు మా టీవీ లో గౌరవం సినిమా వేస్తున్నారు 

ఇంట్లో చచ్చిపోతే ఎవరు responsibility :)

Posted

జీవన్: మా ఆవిడ ఏ విషయాన్నైనా కుండబద్దలు
కొట్టినట్టు చెబుతుంది..

నవీన్: మా ఆవిడయితే ఫ్రిజ్,టీవీ, కూలర్ అన్నీ
పగలగొట్టి మరీ చెబుతుంది..:) :)

Posted

eti kala nijama, diggajalu ila digabaddaru sudden ga,

Posted

Thanks

Posted

Siva reddy ki script ivvandi stage performance chesthaadu...

×
×
  • Create New...