Jump to content

Next Tollywood Blockbuster Chunni


Recommended Posts

Posted
చున్ని ప్రారంభం

chuni.jpg
వెంకీ, చందు, కథానాయకులుగా నటిస్తున్న చున్ని చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓం శ్రీ గురురాఘవేంద్ర క్రియేషన్స్ పతాకంపై వెంకీ నిర్మిస్తున్నారు. జె.మోహన్‌కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మిత్రా కథానాయిక. నాయకానాయికలపై చిత్రీకరించిన మూహూర్తపు సన్నివేశానికి నటుడు సంపూర్ణేష్‌బాబు క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ దర్శకుడిగా ఇది నా రెండవ చిత్రం. సైంటిఫిక్ లవ్‌స్టోరీగా ఓ భిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. 

అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిగా మారిన ఓ యువకుడు చేసే హంగామా ఏమిటనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది. ఈ నెల 6 నుంచి 17 వరకూ సాగే తొలి షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్‌లో సాగుతుంది. యువతరంతో పాటు కుటుంబ వర్గాలు మెచ్చే అంశాలున్న చిత్రమిది. వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. వెంకీ మాట్లాడుతూ కథానాయకుడిగా, నిర్మాతగా ఇదే నా మొదటి చిత్రం. 

నటనకు ఆస్కారమున్న చక్కటి పాత్రతో పరిచయం కావడం ఆనందంగా వుంది అని అన్నారు. కథానాయిక మిత్రా మాట్లాడుతూ మహాలక్ష్మి అనే యువతి పాత్రలో నటిస్తున్నాను. సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందనే విశ్వాసముంది అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చందు, సుభాష్‌ఆనంద్, జయ.జి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మహేంద్రనాథ్, సంగీతం: సుభాష్ ఆనంద్, మాటలు: చింతా శ్రీనివాస్
.
Posted

chunni movie endhi ra.. next shirt pant langa lungibemmiRTlaugh.gif

Posted

chunni movie endhi ra.. next shirt pant langa lungibemmiRTlaugh.gif

brahmi%20laugh.gif

×
×
  • Create New...