psycopk Posted August 5, 2014 Report Posted August 5, 2014 పట్టాభిషేకం మహోత్సవం లో స్వామి హనుమను పిలిచి తెల్లటి వస్త్రములద్వయం ఇచ్చాడు. హనుమకి తెల్లని వస్త్రములు అంటే ఇష్టం. మన దరిద్రం ఏమిటో కాని, ఎక్కడ హనుమవిగ్రహమును చూసినా ఆకుపచ్చని రంగు కాని, నీలము రంగునుకాని వేసి, బట్టలకు ఎర్రరంగు వేస్తూ ఉంటారు. హనుమకి తెల్లని వస్త్రములతోపాటు ఆభరణములు ఇచ్చాడు. అన్నిటిని ధరించాడు. కొంత మంది హనుమకి ఏదో ముత్యాలహారం ఇచ్చారని, దానిని హనుమ కొరికి పరిశీలించి అందులో సీతారాములు లేరని విసిరేశాడు అని ఏవేవో కధలు చెప్తారు. అవి కల్పితములు. హనుమ అలా చేసే అల్పఙ్ఞ్యుడు కాడు. ఆయన నవవ్యాకరణపండితుడు. పూసలు కొరికేయడానికి ఆయన కర్మ కాలిందా? అలాంటి పిచ్చి పనులు ఆయన ఎన్నడూ చెయ్యడు. చక్కగా రామచంద్రమూర్తి ఇచ్చిన హారమును వేసుకున్నాడు. అమ్మవారు చిట్టచివర తన మెడలోనుంచి ఒక హారమును తీసి చేతిలో పట్టుకుంది. అప్పుడు రాముడు ఒక్కసారి సీతమ్మ వంక చూసాడు. ఆ హారమును ఎవరికి ఇవ్వాలో రామునికి తెలుసు. ప్రదేహి సుభగే! హారం యస్య తుష్టాశి భామిని పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః " సీతా , ఆ హారం ఏవరికి ఇవ్వాలో తెలుసా..! .పౌరుషము, బుద్ధి విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, ఘర్షణసామర్ధ్యము, పాండిత్యము అన్ని ఏవరిలో రాశీభూతం అయ్యాయోఅ అటువంటివారికి ఈ హారమును కానుకగా ఇవ్వు.అన్నిటినిమించి ఆ వ్యక్తి నీ అయిదవతనమునకు కారణం అయిఉండాలి." అన్నాడు. ఆవిడ అయిదవతనమునకు కారణమయినవాడు ఎవరు? ఉరిపోసుకుంటున్నప్పుడు క్షేమవార్త చెప్పినవారు ఎవరు? సీతమ్మ తల్లి క్షేమవార్త రామునికి చెప్పినవారు ఎవరు? రామచంద్రమూర్తి క్షేమవార్త భరతునుకి చెప్పినవారు ఎవరు? వచ్చినవాడు రాముడిని సుగ్రీవునికిచెప్పి ప్రాణములి నిలబెట్టినవారెవరు? ఎక్కడెక్కడ ప్రాణము వాయురూపమయితే, అక్కడ వాయునందనుడు హనుమ సాక్షాత్కరిస్తాడు. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణములు నిలబడతాయి.హనుమ ఎక్కడ ఉంటే అక్కడ మంగళం జరిగితీరుతుంది. రాముని సూచన మేరకు సీతమ్మతల్లి ఆ హారమును హనుమచేతికి ఇచ్చింది. హనుమ దానిని తీస్కుని కన్నులకు అద్దుకుని మెడలో వేసుకున్నాడు.
daburamla Posted August 5, 2014 Report Posted August 5, 2014 Thanks for the info... All achha kareka...
Recommended Posts