Jump to content

Sravana Vara Lakshmi Vratam


Recommended Posts

Posted

10568905_675391149176953_255067691774419

 

ఈ అనంత విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ’కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి - అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్తిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే ’ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు.
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ’లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ’లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ’భృగు’వారమనీ వ్యవహరిస్తారు. భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్)పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయాలోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి - ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.
’వర’ శబ్దానికి ’కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు. ’ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం - ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.

Posted

10579968_675082225874512_577022955564514

 

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

Posted

10553419_675425555840179_353395847604392

 

యజుర్వేదం పురుష సూక్తం లో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం , వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణం లో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

Posted

10526149_675476805835054_669802603826124

 

శ్రావణ శుక్రవారపు పాట
జయమంగళం నిత్య శుభమంగళమ్
౧. కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమధాది గణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౨. ఏ వ్రతము సంపదల నెలమితోడుతనిచ్చు, ఏ వ్రతము పుత్రపౌత్రాభివృద్ధినొసగు
అనుచునూ పార్వతి ఆ హరునియడుగగా పరమేశు డీరీతి పలుక సాగె
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౩. కుండినంబనియెడు పట్నంబులోపల-చారుమతి యనియేటి కాంతకలదు
అత్తమామల సేవ పతిభక్తితో చేసి-పతిభక్తి గలిగున్న భాగ్యశాలి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౪. వనిత స్వప్నమందు వరలక్ష్మీ రాబోయి-చారుమతిలెమ్మనుచు చేత చరిచె
చరచినంతనే లేచి తల్లి మీరెవరని-నామస్కరించెనా నళినాక్షికీ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౫. వరలక్ష్మినీ నేను వరములూ యిచ్చేను-మేల్కొనవె చారుమతి మేలుగాను
కొలిచినప్పుడె మెచ్చి కోరిన రాజ్యముల్-వరములనిచ్చినను వరలక్ష్మినే
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౬. ఏ విధిని పూజను చేయవలెననుచూను-చారుమతియడిగెను శ్రావ్యముగను
ఏమి మాసంబున ఏమి పక్షంబున-ఏ వారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౭. శ్రావణమాసమున శుక్లపక్షమునందు-శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి-భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౮. చారుమతి లేచి యా శయ్యపై గూర్చుండి-బంధువుల పిలిపించి బాగుగాను
స్వప్నమున శ్రీవరలక్ష్మీ చకచక వచ్చి-కొల్వమని పలికెనూ కాంతలారా
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౯. ఏ విధంబున పూజ చేయవలెనన్నదో-బంధువులు అడిగిరి ప్రేమతోనూ
ఏమి మాసంబున ఏమి పక్షంబున- ఏవారమూనాడు ఏ ప్రొద్దున
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౦. శ్రావణామసమున శుక్లపక్షమునందు-శుక్రవారమునాడు మునిమాపునా
పంచకల్వలు తెచ్చి బాగుగా తనునిల్పి-భక్తితో పూజించుమని చెప్పెను
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౧. అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చెనను-భక్తితో పట్నము నలంకరించి
వన్నెతోరణులు సన్నజాజులు-మదిచెన్నుగా నగరు శృంగారించిరి
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౨. వరలక్ష్మీనోమనుచు వనితలు అందరు-వరుసతో పట్టుపుట్టములు గట్టి
పూర్ణంపు కుడుములు పాయసాన్నములూ-ఆవశ్యముగ నైవేద్యములు బెడుదురు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౩. కండ్రిమండ్రిగనునుండి బలుదండిగా యెంచి-యొండిన కుడుములు ఘనపడలునూ
దండిగా మల్లెలు ఖర్జూర ఫలములూ-విధిగ నైవేద్యములు నిడుదురూ
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!
౧౪. నిండు బిందెలతోను నిర్మలా ఉదకులు-పుండరీకాక్షులకు వారుపోసి
తొమ్మిదిపోగుల తోరమొప్పగపోసి-తల్లికి కడు సంభ్రమముతోడను
౧౫. వేదవిదుడయినట్టి విప్రుని పిలిపించి, గంధమక్షతలిచ్చి కాళ్ళుకడిగి
తొమ్మిది పిండివంటలు తోమొప్పగబెట్టి, బ్రాహ్మణునకు పాయసముబెట్టుదూరు
!! జయమంగళం నిత్య శుభమంగళమ్ !!

Posted

vratam ki iroju leave tesukunava?

 

TOM BHAYYA already leave tesukundadu...

Posted

Ee roju ee pooja cheyisthunnam evening........first time in life nenu participating.

Posted

Ee roju ee pooja cheyisthunnam evening........first time in life nenu participating.

 

 

idi ammayilaki kada bhaya.. manam chesedi emuntundi

Posted

idi ammayilaki kada bhaya.. manam chesedi emuntundi

 

ademi ledu......rumor adantha.....temple lo evaraina cheyochu...even if you have 5 blowse pieces you can give them to 5 women in the temple itself.

×
×
  • Create New...