timmy Posted August 15, 2014 Report Posted August 15, 2014 I wish all DB members 68th happy indenpendence day to all https://www.youtube.com/watch?v=D6jtbLekh_k
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 MODI speech superb undhi rachha lepudthunnadu script lekunda ()>> ()>> ()>> https://www.youtube.com/watch?v=DJheta-qObU
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 ఎన్నికల ప్రచారమయినా లేక మరే ప్రసంగమయినా స్ర్కిప్ట్ అవసరం లేకుండానే ధారాళంగా ప్రసంగించగల సామర్థ్యం ప్రధాని మోడీ సొంతం. ఆయన చెప్పాలనుకున్న విషయాలపై ఆయనకు ఉన్న సంపూర్ణ అవగాహనే దీనికి కారణం. ఈరోజు ఎర్రకోట నుంచి కూడా ఆయన ప్రసంగం ఇలానే కొనసాగుతోంది. చేతిలో స్క్రిప్ట్ లేదు. జస్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్లు తప్ప. అయతేనేం, ఆయన ప్రసంగం చిన్న తడబాటు కూడా లేకుండా కొనసాగుతోంది. ప్రసంగం తూటాలు పేల్చినట్టు కొనసాగుతోంది. యువతకు విశ్వాసం నింపేలా సాగుతోంది. దేశానికి మార్గనిర్ధేశం ఎలా చేయనున్నారో చెబుతోంది. గతంలో ఏ ప్రధాని కూడా స్క్రిప్ట్ లేకుండా ఎర్రకోట నుంచి ప్రసంగించలేదు. ఇది మోడీకి మాత్రమే సాధ్యమయింది.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 మేడిన్ ఇండియా ముద్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని మోడీ వ్యాఖ్యానించారు. దేశయువత ప్రపంచ యౌవనికపై సింహగర్జన చేయాలని మోడీ సూచించారు. అభివృద్ధి సమతౌల్యం సాధించాలంటే తయారీ రంగం బలోపేతం కావాలని మోడీ పేర్కొన్నారు. ఎలక్ట్రికల్స్ నుంచి ఎలక్టానిక్స్ వరకు... రసాయనాలు నుంచి ఔషధాల వరకు 'మేడిన్ ఇండియా బ్రాండ్' ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలవాలని మోడీ అన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కట్ ను ముంచెత్తాలని మోడీ ఆకాంక్షించారు. ఐటీ నిపుణులు భారతదేశ సత్తా ఏంటో... ప్రపంచానికి నిరూపించారని మోడీ వ్యాఖ్యానించారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 ఏడాదిలోగా దేశంలోని ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామని మోడీ వ్యాఖ్యానించారు. మరుగుదొడ్డు లేక చాలా చోట్ల పిల్లలు బడి మానేసున్నారని... ఇది మనం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని మారుమూల పల్లెటూరిలోని ప్రతీ ఇంటికి...పాఠశాలకు కూడా మరుగుదొడ్డిని నిర్మించేందుకు సంసద్ గ్రామ యోజన కార్యక్రమాన్ని తర్వలో ప్రారంభిస్తున్నట్టు మోడీ తెలిపారు.పరిశుద్ధ భారతం కోసం భారతీయులందరూ కృషి చేయాలని మోడీ కోరారు.
JANASENA Posted August 15, 2014 Report Posted August 15, 2014 Happy Independence Day !!!!! Mera Bharat mahaan !!!!!
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 ఎర్రకోట ప్రసంగంలో మోడీ యువతపై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. అమ్మాయిలు బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తే ప్రశ్నించే తల్లిదండ్రులు... అబ్బాయిలు బయటికి వెళ్తే మాత్రం ప్రశ్నించడం లేదని మోడీ అన్నారు. యువత...ముఖ్యంగా అబ్బాయిలు చెడు మార్గం పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు తన మనసును కలచివేస్తున్నారని మోడీ పేర్కొన్నారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏర్పడ్డ అలసత్వంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని మోడీ విచారం వ్యక్తం చేశారు. చప్ర్రాసీ నుంచి కేబినెట్ సెక్రటరీ వరకు తమ ప్రభుత్వంలో అందరూ ముఖ్యులేనని మోడీ అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి... ఉద్యోగులు బలవంతాన సమయపాలన పాటించకూడదని... క్రమశిక్షణ పాటించడాన్ని ఉద్యోగులు బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 ఎర్రకోట ప్రసంగంలో మోడీ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని కోసం సామాన్యులు వెళితే ఉద్యోగులు ఆ పని చేస్తే 'నాకేంటి' అని అడుగుతున్నారని మోడీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రకమైన ప్రవర్తన మానుకోవాలని...'నాకేంటి' అనే భావన బదులు 'మనం' అనే భావన ఉద్యోగులకు రావాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మోడీ వ్యాఖ్యానించారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 నేతలు, రాజకీయ నాయకులు దేశనిర్మాతలు కాదని... రైతులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశ నిర్మాణానికి విశేషమైన కృషి చేశారని మోడీ అన్నారు. మనమంతా కలిసి పని చేద్దాం... కలిసి ఆలోచిద్దాం... కలిసి నడుద్దామని మోడీ దేశ ప్రజలకు సూచించారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 రైతులు, సామాజిక సేవకులు, యువకులు దేశ నిర్మాణంలో విశేషంగా కృషి చేశారని మోడీ అన్నారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిలో దేశాన్ని పాలించిన ప్రతీ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని మోడీ అన్నారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 దేశప్రధానిగా మాట్లాడటం లేదు...దేశ ప్రధాన సేవకుడిగా మాట్లాడుతున్నా: ఎర్రకోటపై మోడీ ఎర్రకోటపై మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశప్రజలకు మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధానిగా తాను మాట్లాడటం లేదని...దేశానికి ప్రధాన సేవకుడిగా తాను మాట్లాడుతున్నానని ఆయన తన ప్రసంగాన్ని ఆరంభించారు... మోడీ ఈ మాట అనగానే ప్రజల కరతాళధ్వనులతో ఎర్రకోట దద్దరిల్లింది.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 సాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోనున్నారు. సాధారణంగా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరూ ముందే తయారుచేసుకున్న ప్రసంగ పాఠాన్ని ఎదురుగా పెట్టుకుని, ఎర్రకోట నుంచి చదవడం ఆనవాయతీగా వస్తోంది. అయితే, దీనికి భిన్నంగా మోడీ కాసేపట్లో ఆశువుగా ప్రసంగించనున్నారు. తన ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలు... విధానాలను మోడీ ఈ ప్రసంగంలో స్పష్టం చేయనున్నారు.
Recommended Posts