timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 పాములు ఆడించేవారు(స్నేక్ ఛార్మర్స్), చేతబడుల దేశంగా భారతదేశం గురించి ఒకప్పుడు వెటకారంగా పాశ్చాత్యులు చెప్పుకునేవారని మోడీ అన్నారు. కానీ అదే పాశ్చాత్యులు ఇప్పుడు ఐటి రంగంలో భారతదేశ యువత ప్రతిభను చూసి అశ్చర్యపోతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐటి రంగం భారతదేశానికి సరికొత్త గుర్తింపు తీసుకువచ్చిందని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో డిజిటల్ ఇండియాను తాను చూడాలనుకుంటున్నానని మోడీ అన్నారు.
timmy Posted August 15, 2014 Author Report Posted August 15, 2014 జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 09:07 AM కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ ఎత్తున విద్యార్థులు, యువత తరలి వచ్చారు.
Recommended Posts