timmy Posted August 17, 2014 Report Posted August 17, 2014 కృష్ణా జిల్లాలో భూమి కంపించడంతో... ఏం జరుగుతోందో తెలియని ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పరుగులు తీశారు. నందిగామ, రైతుపేట ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కళ్ల ముందే భూమి తిరిగినట్టు అనిపించడం, ఇళ్లల్లోంచి సామాన్లు కిందపడిపోవడంతో బయటకు పరుగులుతీశారు. కాగా, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ, గుంటూరును ఏర్పాటు చేస్తారనే వార్తల నేపథ్యంలో భూప్రకంపనలు దుమారం రేపుతున్నాయి. రేపు రాజధాని ఏర్పడిన తరువాత ఏదయినా జరగరాని దారుణం జరిగితే? అనే భయం ఊపిరిపోసుకుంటోంది. కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశముందని భూభౌతిక శాస్త్రవేత్తలు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
Recommended Posts