Jump to content

Recommended Posts

Posted

Thursday, March 29, 2012
"యక్ష" కబుర్లు
 
0.jpg
 
యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. నాకు కూడా ఇదే భావన ఉండేది కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ యక్షస్వరూపాయ అని అంటాం కదా! శివుడు దేవుడు కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు అనుకున్నా. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలుసుకున్నా. వాటిని మీతో పంచుకుందామని ఇక్కడ పెడుతున్నా.
 
విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథోలోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు). అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి అంటారు కదా! అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణాలకీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
1042468.jpgవీరు ఎక్కడుంటారో తెలిసింది కనుక ఎలా ఉంటారు అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిని అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షినులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చుట. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని నా అభిప్రాయం. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షినిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే యక్ష ప్రశ్నల (యమ ధర్మరాజు ఒక యక్షుని రూపంలో వెళ్తాడు) గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన నాచన సోమన గారిని ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు.
2008+navratri465.JPGమనకి బాగా తెలిసిన యక్షిని తాటకి. సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.
మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.
yakshagaanam_2.jpg
యక్ష గానం అనేది చందోబద్ధమయిన నాటకము, కూచిపూడి నాట్యంలో ఒక ప్రక్రియ. ఇందులో గద్యం, పద్యం, పాటలు అన్నీ కలగలిపి ఉంటాయి. యక్ష గానాలలో రామాయణాన్ని రచించి ఎంతో మందికి చేరవేసినది ఆంధ్ర కాళిదాసు బిరుదాంకితుడయిన ఆలూరి కుప్పన కవి. శ్రీనాధుని కాలంలో ఇవి బాగా ప్రచారంలో ఉండేవని, తెలుగులో మొత్తం నాలుగువందలు పైచిలుకు యక్ష గానాలున్నాయని అంచనా.

యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని దెయ్యాలలా భావిస్తున్నారు. పూర్వం విఠాలాచార్య సినిమాలలో మనం చూసిన ఎన్నో శక్తులని (పాదుకా సిద్ధి, అంజన సిద్ధి, మేఘ సిద్ధి, మొదలయినవి) చూసి నిజం కాదేమో అనుకున్నా కానీ ఇవన్నీ యక్షుల శక్తులు.
 
super... GP
 
Posted

ee q'n kuda  yaskha prashne naa...

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

deeni meeda naaku eppati nuncho doubt....idi correst or wrong dont know.

Posted

modern trend ni follow ayye vaallu kaakunda mana traditons ki respect iche vaallu ee db lo kontha mandi ainaa unnarane nammakam tho vesaanu anthe gaani andaritho pogidinchukotaanikotaaniki kaadu

Ante ne telugu post ni chadavakapothe inka mana traditions ki respect ivvanatte na bhayya..too much asalu.. ala ela..

Posted

GP

Thursday, March 29, 2012
"యక్ష" కబుర్లు
 
0.jpg
 
యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. నాకు కూడా ఇదే భావన ఉండేది కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ యక్షస్వరూపాయ అని అంటాం కదా! శివుడు దేవుడు కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు అనుకున్నా. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలుసుకున్నా. వాటిని మీతో పంచుకుందామని ఇక్కడ పెడుతున్నా.
 
విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథోలోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు). అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి అంటారు కదా! అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణాలకీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
1042468.jpgవీరు ఎక్కడుంటారో తెలిసింది కనుక ఎలా ఉంటారు అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిని అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షినులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చుట. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని నా అభిప్రాయం. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షినిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే యక్ష ప్రశ్నల (యమ ధర్మరాజు ఒక యక్షుని రూపంలో వెళ్తాడు) గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన నాచన సోమన గారిని ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు.
2008+navratri465.JPGమనకి బాగా తెలిసిన యక్షిని తాటకి. సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.
మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.
yakshagaanam_2.jpg
యక్ష గానం అనేది చందోబద్ధమయిన నాటకము, కూచిపూడి నాట్యంలో ఒక ప్రక్రియ. ఇందులో గద్యం, పద్యం, పాటలు అన్నీ కలగలిపి ఉంటాయి. యక్ష గానాలలో రామాయణాన్ని రచించి ఎంతో మందికి చేరవేసినది ఆంధ్ర కాళిదాసు బిరుదాంకితుడయిన ఆలూరి కుప్పన కవి. శ్రీనాధుని కాలంలో ఇవి బాగా ప్రచారంలో ఉండేవని, తెలుగులో మొత్తం నాలుగువందలు పైచిలుకు యక్ష గానాలున్నాయని అంచనా.

యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని దెయ్యాలలా భావిస్తున్నారు. పూర్వం విఠాలాచార్య సినిమాలలో మనం చూసిన ఎన్నో శక్తులని (పాదుకా సిద్ధి, అంజన సిద్ధి, మేఘ సిద్ధి, మొదలయినవి) చూసి నిజం కాదేమో అనుకున్నా కానీ ఇవన్నీ యక్షుల శక్తులు.
 
×
×
  • Create New...