timmy Posted August 24, 2014 Report Posted August 24, 2014 దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏంమాట్లాడినా అందులో ఒకింత తిరుగుబాటు ధోరణి కనిపిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, కేసీఆర్... ఇలా వ్యక్తులెవరైనా, విషయం ఏదైనా వర్మ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతారు. తాజాగా ఆయన కైలాస నాథుడి లీలను ప్రశ్నించారు. దీనిపై ఆయన మాటల్లోనే... "తన తల్లి స్నానం చేస్తుండగా కాపలా నిల్చున్న పిల్లవాడు అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డగించగా.... ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి బాలుడి తలనరికేయడం దారుణం. కరడుగట్టిన అల్ ఖైదా ఉగ్రవాదులు కూడా అంత క్రూరంగా వ్యవహరించరేమో! పైగా, అక్కడ కాపలా నిల్చున్న చిన్నవాడు తన కొడుకని దేవుడికి తెలియదట. కొడుకు కాకపోతే ఎవరినైనా నరికేస్తారా? చంపేసిన తర్వాత కొడుకని తెలుసుకుని దారినపోయే ఏనుగు తల నరికి, దాన్ని తెచ్చి బాలుడి మొండెంపై పెట్టడమేంటి? అంత శక్తి ఉన్నప్పుడు ఆ బాలుడి తలే అతికించవచ్చు కదా..! ఆదర్శంగా ఉండాల్సిన దేవుళ్ళే దెయ్యాలకంటే దారుణంగా ప్రవర్తిస్తుంటే నాలాంటి సామాన్యుడికి తప్పక చిరాకేస్తుంది. అయినా, లోగుట్టు పరమశివుని కెరుక" అంటూ ముక్తాయించారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ipaddress0 Posted August 24, 2014 Report Posted August 24, 2014 Vadi moham, half knowledge gadu.. bye1
Recommended Posts