Hitman Posted August 27, 2014 Report Posted August 27, 2014 సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న రమేష్ (20) అనే యువకుడి ఆచూకీ కోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఆరాతీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పాక్ సరిహద్దురేఖ దాటిన నేరంపై అక్కడి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని లాహోర్ జైలులో నిర్బంధించారు. ఉభయదేశాల మధ్య ఖైదీలను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం ఉండటంతో అక్కడి జైలులో ఉన్న రమేష్ వివరాలను పాక్ ప్రభుత్వం మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందజేసింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు పాక్ పంపిన వివరాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు పంపిం చారు. రమేష్‌ది శ్రీకాకుళం అని, అతను ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు ఉంటాడని, మెడపై కుడివైపు పుట్టుమచ్చ ఉందని మాత్రమే పాక్ అధికారులు తెలిపారు. ఈ ఆనవాళ్లు ఉన్న రమేష్‌ను గుర్తించిన వారెవరైనా సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రవీందర్ (సెల్‌నెంబర్ 94906 17429)ను సంప్రదించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
Recommended Posts