timmy Posted August 28, 2014 Report Posted August 28, 2014 మనవాడు నలుచుకున్న నలుగుపిండితో నీకు ప్రాణముపోయడమేమి తల్లి గౌరవము నిలబెట్టు క్రమములో తండ్రిచేతిలో ప్రాణముపోవడమేమి త్రికాలఙ్ఞుడు త్రిశూలమెత్తి నీ కుత్తుకుత్తరించడమేమి అడవిలో మృతకరి తలను తెగ్గోసితెచ్చి నీకు అతికించి బతికించడమేమి చల్లని చంద్రుని చూపుకు నీ బ్రతుకు బుగ్గవ్వడమేమి జగన్మాతకు అగ్రజాతుడైనా నీకు క్షణక్షణమూ ఈ ప్రాణ సంకటములేమి అడుగులేయ ఆపశోపాలుపడు నీకు ఆటంకములపై ఆధిపత్యమేమి స్థూలతనముతో శ్రమనొందు నీకు ఆ బక్కచిక్కిన సూక్ష్మ వాహనమేమి నీవు దైవత్వములో దౌర్బల్యమునకు ప్రతిరూపువా? లేక మానవత్వమున పోరాటపటిమకు ప్రతీకవా? దైవాంశమును అడ్డు పెట్టుకుని అప్పనముగా అందలమందిన వాడు కాడు నిరాశ నిస్పృహలు తిరస్కార తిరోగమనాలూ ప్రతిబాటన ఓడించ ప్రతినబూనినా కదన కౌశలముతో బుద్ధి బలముతో భక్తిప్రపత్తులతో వినయ వందనములతో అడ్డంకులకు ఎదురొడ్డి నిలిచి విఘ్నాధిపత్యమునకు అర్హుడైనాడు అమ్మ ఆనను పూని అయ్యకడ్డుగ నిలిచి ప్రాణములను పణముపెట్టి ప్రమధులను ప్రతిఘటించి నమ్ముకున్న నియతిని వమ్ముచేయని బాల బోళానీతి తప్పువప్పుల లెక్కలలో తరతమాలు లెక్కచేయని కురచ సమవర్తి అదర్శాలలో ఆకశాలలో తిరుగాడు అందనివాడు కాడు ఆచరించ తగిన విధానముతో జీవితమే పాఠము చేసి చూపిన అందరివాడు వీడు SOURCE: idlebrain
Recommended Posts