Jump to content

Recommended Posts

Posted

వన్ మ్యాన్ షో ('రచ్చ' రివ్యూ)

 

'ఏదో చెప్పి తొడలు కొట్టే రకాన్ని కాదురా నేను', 'నా అబ్బను అంటే ఎవడి అబ్బనయినా నరుకుతా'వంటి డైలాగులతో 'రచ్చ'.. రచ్చ చేయటానికి థియేటర్లోకి దూకింది. అలాగే పంచ్ డైలాగులు, ఫార్ములా కథతో ఈ మాస్ సినిమాని రూపొందించి ఓ వర్గాన్ని ఆనందపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాఫ్ సరదా సరదాగా ఎంటర్టైన్మెంట్ తో గడిచిపోయిన ఈ సినిమా సెకండాఫ్ కి వచ్చేసరికి పాతబడిన 'బన్నీ'తరహా ఫ్లాష్ బ్యాక్ తో బయిటపడాలనే ప్రయత్నం చేసింది. అప్పటికీ రామ్ చరణ్ తనదైన స్టైలిష్ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

 

 

బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్) ఎప్పటిలాగే బెట్టింగ్ లు కడుతూ కుటుంబాన్ని లాక్కొస్తూంటాడు. అయితే అనుకోకుండా అతని పెంపుడు తండ్రి(ఎమ్.ఎస్ నారాయణ)తెగ తాగి లివర్ పాడుచేసుకుంటే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద ఎమౌంట్ కోసం హీరో అతి పెద్ద బెట్ కి సిద్దమవుతాడు. చైత్ర(తమన్నా) అనే టైట్ సెక్యూరిటీ ఉన్న కోటీశ్వరురాలు కూతురుని లవ్ లో పడేస్తానని పందెం కాస్తాడు. అందుకోసం అతను రాత్రింబవళ్లూ ఆమె చుట్టూ తిరిగి... ఆమెను ఆకట్టుకోవటం కోసం సాహసాలు చేస్తూ.. పాటలు పాడుతూంటాడు. సరిగ్గా పందెం గెలచామనుకునే సమయానికి అతనికో నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ చైత్ర ఎవరు... ఏంటా నిజం అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఫస్టాఫ్.. ఎంటర్టైన్మెంట్.. సెకండాఫ్.. యాక్షన్ అంటూ ఫార్ములా ప్రకారం స్క్రిప్టుని విడతీసి మరీ స్క్రీన్ ప్లే చేసుకున్న ఈ చిత్రం ఫస్టాఫ్.. హీరోయిన్ పడేయటానికి హీరో చేసే ట్రిక్కులతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఎప్పుడన్నా ఎంటర్నైమెంట్ తగ్గుతుందనుకుంటే... బ్రహ్మానందం వంటి కమిడెయిన్స్ తో లాగేసారు. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి... అసలు కథ ఏమిటి... హీరో, హీరోయిన్స్ గతం ఏమిటి.. వాళ్లిద్దరికి ఉన్న రిలేషన్ ఏమిటి.. ఈ ప్రేమ పందెం కాయటం వెనక ఉన్న అసలు రీజన్ ఏమిటి వంటి సవాలక్ష సందేహాలకు సమాధానం చెప్పటం కోసం ప్లాష్ బ్యాక్ వెయ్యాల్సి వచ్చింది.

ప్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి లవ్ స్టోరీ కాస్త రివెంజ్ స్టోరీగా టర్న్ తీసుకుంది. దాంతో కథ బ్రేక్ లు పడి... కాస్తా డ్రై గా మారిపోయింది. దానికి తోడు ఆ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్నో సార్లు తెలుగు తెరపై చూసింది కావటం వల్ల కాస్త ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా హీరో కి విలన్స్ ఎవరో తెలిసి కౌంటర్ ఇచ్చేసరికి కథ క్లైమాక్స్ చేరుకుంది. దాంతో విలన్ పై విజయం సాధించటానికి హీరోకి స్క్రీన్ టైం సరిపోలేదు. ఎంతసేపు హీరోయిన్ ని తన ట్రిక్ లో పడేసిన హీరో, విలన్స్ పై ఒక్క ట్రిక్కూ ప్లే చేయలేకపోయాడు.. ఒక్క ట్విస్టు ఇవ్వలేకపోయాడు. పూర్తి ప్యాసివ్ గా మారాడు.

ఇక నటీనటుల్లో రామ్ చరణ్ తనదైన శైలిలో వన్ మ్యాన్ షో లాగ సినిమాని మోసుకు వెళ్లిపోయాడు. ముఖ్యంగా డైలాగు డెలవరీలో పంచ్ విసిరేటప్పుడు చాలా నేర్పుగా తన తండ్రిని గుర్తుకు తెస్తూ పరిణితితో సాగిపోయాడు. ఇహ పాటల్లో రచ్చ టైటిల్ సాంగ్, వానా వానా వెల్లువాయేలకు అద్బుతమైన డాన్స్ స్పెప్స్ వేసి తన తోటి హీరోలకు సవాల్ విసిరాడు. హీరోయిన్ తమన్నా.. ఊసరవెల్లిలో తన పాత్రను గుర్తు చేసినట్లైంది. కమిడెయిన్స్ లో బ్రహ్మానందం రంగీలా ఫ్రమ్ చికాగో గా బాగానే నవ్వించాడు. అలీ ఉన్నది కాస్సేపయినా తనదైన పంచ్ వేసాడు. ఎమ్.ఎస్ నారాయణ.. కమిడెయిన్ గా కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా మెప్పించాడు.

సంగీత దర్శకుడు మణిశర్మ తన స్పెషలైజేషన్ రీరికార్డింగ్ అని మరో సారి నిరూపించుకున్నారు. ఎడిటింగ్, కెమెరా ప్రతీ ప్రేమ్ ని రిచ్ గా చూపెట్టడంలో సఫలీకృతమయ్యాయి. సంపత్ నంది.. పెద్ద హీరోని అయినా ఎక్కడా తడబడకుండా బాగా డీల్ చేసాడు. కథ, కథనం బాగా చేసుకుంటే మరో మాస్ డైరక్టర్ ఇండస్ట్రీకి దొరికినట్లే. ఇక పరూచూరి బ్రదర్శ్ డైలాగుల విషయానికి వస్తే ఎప్పటిలాగే వారు హీరోని ఎలివేట్ చేస్తూ పంచ్ లతో దూసుకు వెళ్లిపోయారు.

ఏదైమైనా మొదటి నుంచి ఈ చిత్రం రూపకర్తలు తమ టార్గెట్ మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అని స్పష్టంగా చెప్తున్నారు. వారి అంచనాలకు తగినట్లే తయారైన ఈ చిత్రం వారిని రీచ్ అయ్యే అవకాశం ఉంది. పాటలు, ఫైట్స్ మిగతా జనాలకి కూడా పడితే సినిమా ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంది

 pfdb_brahmi09.gif?1377272460

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    14

  • vadapav

    10

  • ipaddress0

    4

  • Johny

    2

Popular Days

Top Posters In This Topic

Posted

bhayya review genuine aa kaadha suneeell3.gif?1289983772

 

Nijame babu chicago lo memu almost 16 people velam dantlo half fans even valaki natchala

Posted

రొటీన్ వి‘నాయక్’ (రివ్యూ) 

 

 

 

Rating:
2.5/5

 

నా జోలికి వస్తే క్షమిస్తాను కానీ...నా వాళ్ల జోలికి వస్తే నరికేస్తాను..." అంటూ రామ్ చరణ్ ఈ సంక్రాంతి పండక్కి ...'నాయక్' గా ముస్తాబై థియోటర్ లలో దూకేసాడు. ఎంతో ఎనర్జీతో పాటలు,ఫైట్స్ చేసుకుంటూ పోయినా కథ,కథనంలో ఎక్కడా మచ్చుకు కూడా ప్రెష్ నెస్ లేకుండా జాగ్రత్తపడటంతో అతని శ్రమకు తగ్గ సినిమాగా కనపడటం లేదు. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్‌ చేసారనుకుని చూస్తే... దాదాపు ప్రతీ సీనూ అంతకు ముందు వచ్చిన చిత్రాల మిక్స్ లా అనిపించి ఉసూరుమనిపిస్తుంది. దానికి తోడు రామ్ చరణ్ కూడా చాలా చోట్ల చిరంజీవి అనుక(స)రిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఫస్టాఫ్ లో బ్రహ్మానందం, సెకండాఫ్ లో ఎమ్.ఎస్ నారాయణ కామెడీ సినిమాను కాపు కాసి,నిలబెట్టే ప్రయత్నం చేసింది. మెగా ఫ్యాన్స్ కు నచ్చే ఈ చిత్రం మిగతా సంక్రాంతి చిత్రాల పరిస్ధితిని బట్టి విజయావకాశాలు ఏ రేంజిలో ఉన్నాయో అంచనా వేయాలి.

 చెర్రీ (రామ్ చరణ్) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన అంకుల్ జిలేబి(బ్రహ్మానందం) అత్యుత్సాహంతో నోరు జారి,ఇరుక్కోవటంతో లోకల్ డాన్ గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) దగ్గరకు సెటిల్ మెంట్ కు వెళ్లాళ్సి వస్తుంది. అయితే బాబ్జిని కలిసిన చెర్రికి అక్కడ బాబ్జీ చెల్లెలు మధు (కాజల్) తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో బాబ్జీని మాటలతో మభ్యపెట్టి ప్రస్తుతానికి ఆ గండం నుండి గట్టెక్కి, మధుని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తూంటాడు. మరోప్రక్క కలకత్తాలో,హైదరాబాద్ లలో చెర్రి పోలికలతో ఉన్న ఓ వ్యక్తి హత్యలు చేస్తూంటాడు. అతని కోసం సిబిఐ (ఆశిష్ విధ్యార్ధి)టీం వెతుకుతూంటుంది. ఇంతలో ఆ చెర్రి పోలికలతో ఉన్న మరో వ్యక్తి...నెక్ట్స్ మర్డర్ చేయబోయేది మినిస్టర్ రావత్ (ప్రదీప్ రావత్)అని తెలుస్తుంది. కుంభమేళాలో అతన్ని చంపబోతున్నాడని తెలుసుకున్న సీబీఐ అక్కడకి చేరుకుంటుంది. సరిగ్గా అదే సమయానకి చెర్రీ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు సీబీఐ వారు చెర్రీని చూసి ఆరెస్టు చేయటానికి సిద్దమవుతారు....అసలు ఆ మరో వ్యక్తి ఎవరు...లేక చెర్రీనే ...ఆ హత్యలన్ని చేస్తున్నాడా...మరి నాయక్ కథేంటి, అమలాపాల్ కి ఈ చిత్రంలో పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే...సినిమా చూడాల్సిందే.

 

ద్విపాత్రాభినయం కథలు తెలుగు తెరకు కొత్తేంకాదు.. .దర్శకుడు వివి వినాయిక్ కి అంతకన్నా కాదు.. ఆయన గతంలో చెన్నకేశవరెడ్డి,అదుర్స్ చిత్రాలు ఇదే పాట్రన్ లో చేసారు. ఇలాంటి చిత్రాలకు కథ కన్నా కథనంపైనే ఎక్కువ ఆధారపడాలి..ఇంకా చెప్పాలంటే ట్రీట్ మెంటే ఈ తరహా చిత్రాలకు ప్రాణం. అయితే 'నాయక్' లో స్క్రీన్ ప్లే నే పెద్ద మైనస్ గా నిలిచింది. ద్విపాత్రాభినయం ఉన్నప్పుడు ఆ ద్విపాత్రాభినయం వల్ల కథకు కలిసి వచ్చే ఉపకారం అంటే... మామూలు కథకూ, ద్విపాత్రాభినయం కథకూ తేడా కనపడాలి. అంతేగానీ..రెండూ పాత్రలు ఉన్నాయి అని ఇద్దరని రెండు కథలలుగా చూపించుకుంటూ పోతూ ఉంటే ఉపయోగం ఉండదు. ద్విపాత్రాభినయం చిత్రాల్లో ఆ రెండు పాత్రలూ కలిసినతర్వాత ఏం జరుగుతుంది అనేదే కీలకం.

'నాయక్' విషయానికి వచ్చేసరికి..రెండు పాత్రలూ అసలు ఎవరు..వారి నేపధ్యాలు...ఆ పాత్రలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటీ అని చూపించేసరికే...ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఫస్టాఫ్ మొత్తం...మొదటి పాత్ర చెర్రీ,అతని లవ్ స్టోరీ చూపెడితే,సెకండాఫ్ రెండవపాత్ర సిద్దూ నాయక్ అంటూ అతని కథ ప్లాష్ బ్యాక్ రూపంలో చెప్పారు. ఇలా స్కీన్ టైం మొత్తం ఆ రెండు పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కే సరిపోయింది. దాంతో ద్విపాత్రాభినయం పాత్రలు రెండు కలిపి విలన్ ని ఎలా ముప్పు తిప్పలు పెట్టారు..అనేది చూపెట్టటానికి టైం సరిపోలేదు. అలాగే హీరోలు ఒకరు కాదు..ఇద్దరు అని విలన్ తెలిసే సరికి క్లైమాక్స్ కి వచ్చేసింది. అలా లేటు చేసుకుంటూపోయారు. ఆ లేటుకి కారణం ...ఇంటర్వెల్ బ్యాంగ్...రెండవపాత్ర ఉన్నాడని ప్రేక్షకులకు తెలియటమే...ట్విస్ట్ గా భావించారు. ఈ అంశం పెడితే..ద్విపాత్రాభినయంలో రెండు పాత్రలకూ వైరుధ్యం ఉంటేనే బావుంటాయనేది సినీ సత్యం. కానీ ఈ చిత్రంలో చెర్రీ,'నాయక్' పాత్రలు రెండూ ఆవేశంతో ప్రజలుకోసం పాటుపడుతూ, మధ్యమధ్యలో హీరోయిన్స్ తో డాన్స్ చేసే పాత్రలు... రెండూ శారీరకంగానే కాక...వ్యక్తిగతంగానూ ఒకే పోలిక కావటంతో.... కాంప్లిక్ట్ జనరేట్ కాలేదు.

అయితే దర్శకుడు ఎన్నో కమర్షియల్ చిత్రాలు చేసిన అనుభవంతో.. పైన చెప్పుకున్న లోటుని కనపడనీయకుండా కామెడీతో నడపాలని ప్రయత్నించి కొంతవరకూ సఫలికృతుడు అయ్యాడు. ఫస్టాప్ లో వచ్చే బ్రహ్మానందం జిలేబీ పాత్ర ..గతంలో వినాయిక్ చిత్రం కృష్ణ ని గుర్తు చేసినా ఉన్నంతలో బాగానే నవ్వించింది. ఇక సెకండాఫ్ లో వచ్చే లిప్ మూవెమెంట్ లు చదివే సిబిఐ ఉద్యోగి పాత్రలో ఎమ్.ఎస్ నారాయణ కూడా నవ్వించారు. అయితే అదుర్స్ చిత్రంలా అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం కాకపోవటంతో...హీరోని మర్డర్ కేసులో విలన్ ఇరికించటం వంటి కొన్ని కీలకమైన సీన్స్ తేలిపోయాయి. హీరోయిన్స్ కాజల్, అమలాపాల్ ఇద్దరూ గ్లామర్ కే పరిమితం అయ్యారు. ఫక్తు కమర్షియల్ సినిమా కాబట్టి అంతకుమించి ఆశించలేము. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉంటూ హీరోయిన్ ని ప్రేమించే పాత్రలో వేణు మాధవ్ ఓకే అనిపిస్తాడు. విలన్స్ గా ప్రదీప్ రావత్,రాహూల్ దేవ్ ఫరవాలేదనిపిస్తే, కోట శ్రీనివాసరావు, తణికెళ్ల వంటి నటులను సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది. జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు మాత్రం తన రెగ్యులర్ డైలాగ్ డెలవరీలతో బాగనే నవ్వించారు.

ఈ భారీ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులంతా సీనియర్సే కాబట్టి వారి ప్రతిభ సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఎడిటింగ్ విషయంలో... ఫస్టాఫ్ ని ఇంకా ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. కెమెరా వర్క్ ..రామ్ చరణ్ ని బాగా హైలెట్ చేసింది. తమన్ పాటలు మాత్రం అంత కిక్ ఇవ్వలేదు. ఆ పాటలకు రామ్ చరణ్ వేసిన స్టెప్స్ మాత్రం బాగున్నాయి. ఛార్మి ఐటం సాంగ్ రొటీన్ గా ఉంది. టైటిల్ సాంగ్ నాయక్ కి, శుభలేఖ రాసుకున్నా పాటకు బాగా రెస్పాన్స్ వచ్చింది. రచయిత ఆకుల శివ కథ పరమ రొటీన్ గా చేసినా డైలాగులు బాగానే పేల్చాడు. దర్శకుడుగా వినాయిక్ మాత్రం తన గత చిత్రాల రేంజిలో మాత్రం చేయలేనిపిస్తుంది. వినాయిక్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయి. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.

ఫైనల్ గా ఏ విధమైన ఎక్సపెక్టేషన్స్ లేకుండా, కథతో సంభందం లేకుండా రామ్ చరణ్ పాటలకు వేసే స్టెప్స్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ కామెడీ వంటివి ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. ఈ సంక్రాంతికి మిగతా సినిమాలేవి వర్కవుట్ కాకపోతే ఇదే ఏకైక ఆప్షన్.

Posted

పవన్ మార్క్ మ్యాజిక్ ఇది...(‘అత్తారింటికి దారేది' రివ్యూ)

Rating:
3.0/5

 

అత్తని అల్లుడు టీజ్ చేయటం,మరదళ్లతో రొమాన్స్ తో రఫ్పాడించటం తరహా ఫార్ములా సినిమాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. దాదాపు ఇప్పుడున్న పెద్ద హీరోలంతా ఆ ఫార్మెట్ ని అరగదీసి వదిలేసారు. అయితే ఈ చిత్రంలో కొత్తదనం అంతా అదే కథని పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ తో ముచ్చటగొలిపేలా చెప్పటం. ముఖ్యంగా పవన్ వంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న మాస్ హీరోని భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథలో కి తీసుకువచ్చి త్రివిక్రమ్ మ్యాజిక్ చేసారు. దాంతో పైరసీ అడ్డొచ్చినా తన ప్రతాపం చూపిస్తూ థియోటర్స్ లో ఆడియన్స్ చేత డాన్స్ చేయిస్తోంది. పూర్తిగా ఫన్ నే నమ్ముకున్న ఈ సినిమా అక్కడక్కడా సెంటిమెంట్ బ్లాక్స్ వద్ద కాస్త స్లో అయినా మొత్తంమీద సరదాగా నడిచిపోయింది. గబ్బర్ సింగ్ రేంజిని అందుకుంటుందో లేదో కానీ పవన్ నుంచి ఆశించే మంచి కమర్షియల్ సినిమా ఇది.

ఇటిలీలో ఉంటే అపర కుబేరుడు రఘు నందన్(బొమన్ ఇరాని)కి ముద్దుల మనవడు గౌతమ్‌ నందా (పవన్‌ కల్యాణ్‌). ఆరడుగుల బుల్లెట్‌లాంటి అతన్ని ఓ రోజు తాతగారు పిలిచి...ప్రతీ పుట్టిన రోజుకి నేను నేను గిప్ట్ ఇస్తున్నాను. ఈ పుట్టిన రోజుకి... నాకు నువ్వు గిప్ట్ ఇవ్వాలి. అది మరేదో కాదు...నా నుంచి విడిపోయిన నా కూతురు అంటే నీ మేనత్త సునంద(నదియా)ని ఇండియా నుంచి తీసుకు రావాలి అని అడుగుతాడు. దానికి సరేనన్న గౌతమ్ ...తాతయ్య కి ఇచ్చిన మాట కోసం.. ఇండియా వస్తాడు. ఇక్కడ తన పేరు సిద్దార్థ్‌గా మార్చుకొంటాడు. సునందకి ఉన్న ఆస్తి ఫైవ్ స్టార్ హోటల్ అప్పుల్లో ఉందని తెలుసుకుంటాడు. సునంద భర్త(రావు రమేష్)ని యాక్సిడెంట్ ని కాపాడి... తానెవరో చెప్పకుండా ఓ సాధారణ డ్రైవర్‌గా ఆ ఇంటిలో చేరతాడు. అక్కడ తన మరదళ్లు ప్రమీల( ప్రణీత), శశి (సమంత) ని చూస్తాడు. అక్కడ నుంచి తనదైన శైలిలో ఆటప్రారంభించి,తన పొగరుమోతు అత్త సమస్యలని తీర్చి ఆ కుటుంబానికి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అవి ఏమిటి... తన అత్త మనస్సు మార్చి తన తాత అడిగిన గిప్ట్ ని ఇవ్వగలిగాడా అనేది మిగతా కథ.

" సార్..ఇదే హైదరాబాద్ ...ట్రాఫిక్ చాలా బ్యాడ్... పెద్దమ్మతల్లి ఫేమస్ గాడ్.." ఈ డైలాగు వినగానే కళ్లు మూసుకుని ఒక్కసెకను కూడా ఆలోచించకుండా ఇది త్రివిక్రమ్ రాసింది అని చెప్పేయగలం. అలాంటి పంచ్ లు సీన్ కు మినిమం ఒకటైనా వడ్డించుకుంటూ వచ్చిన త్రివిక్రమ్ ఈ సారి పవన్ ని కొంచెం కొత్తగా ఖుషీ కాలం నాటి కుర్రాడిలా కూల్ గా చూపెట్టాలనుకున్నాడు. దాదాపుగా సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు. ఫ్యామిలీ కథకు...పవన్ పవర్ ని యాడ్ చేసి హిట్ కి ఇదో దారి అని చూపెట్టాడు.

కథ విషయానికి వస్తే సాధారణంగా...సింపుల్ స్టోరీ ఉన్నప్పుడే ట్రీట్ మెంట్ కి ఎక్కువ అవకాసం ఉంటుందనేది ఈ స్క్రిప్టు చూస్తే అర్దమవుతుంది. ముఖ్యంగా కథలో మలుపులు కన్నా ప్రేక్షకుల్ని అలరించే మెరుపులని సినిమాలో పెట్టి సక్సెస్ కొట్టవచ్చు అనేది గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. దాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లారు. సినిమాలో ఫ్యాన్స్ ని అలరించే అంశాలను తనదైన శైలిలో సమకూర్చి పవన్ ఫ్యాన్స్ కి పండుగ చేసారు.

అలాగే " సింహం పడుకుందికదా అని జూలుతో జడ వెయ్యకూడదు రా... అదే పులి పలకరించింది కదా అని ప్రక్కన నిలబడి ఫోటో దిగాలనుకోకూడదు" వంటి డైలాగ్స్ పవన్ కూల్ గా కిర్రెక్కించాడు. ఎందుకు హీరోలు ఎప్పుడూ పాత రూట్లోనే మాస్ డైలాగులు చెప్తూ,అవే తరహా ఫార్ములా ఫైట్స్ చేస్తూ,రొటీన్ రొమాన్స్ తో కాలం వెల్లబుచ్చుతూంటారు...అన్న ప్రశ్నకు కొంతలో కొంత ఈ సినిమా జవాబు ఇస్తుంది. పవన్ నుంచి రెగ్యులర్ మసాలా ఆశించేవాళ్ళకు కొద్ది సమయం పట్టినా తర్వాత బాగుందని అంటారు.

 

ప్రతీ సారిలా ఇది పవన్ వన్ మ్యాన్ షో అని చెప్పలేము. ఇది త్రివిక్రమ్, పవన్,దేవిశ్రీప్రసాద్ కలిసి చేసిన మ్యాజిక్. వీరు ముగ్గురూ సమానంగా స్క్రీన్ సమయాన్ని పంచుకుని అల్లాడించారు. టెక్నీషియన్స్ ఇద్దరి ఎఫెర్ట్ లను తెరపై అద్బుతంగా పవన్ ప్రెజెంట్ చేసారు. ఫన్నీ సీన్స్ లో ఎంతలా నవ్వించారో, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్ లోనూ అంతలా లీనమై తననెందుకు పవర్ స్టార్ అంటారో మరోసారి తెలియచేసారు.

"పాము పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద కాలు వెయ్యికూడదు రోయ్...".
"నేను సింహం లాంటోండిని...అది గెడ్డం గీసుకోలేదు..నేను గీసుకోగలను..అంతే తేడా".
త్రివిక్రమ్ ని చాలా మంది దర్శకుడుగా కన్నా మాటల రచయితగానే ఎక్కువ ఇష్టపడతారు. అదే విషయం మరోసారి కరెక్టే అనిపించేలా తన పెన్ పవర్ చూపించారు. అలాగే సాధారణంగా ఎన్నారై లు ఇండియా వచ్చారంటే సుకుమారుడు,గ్రీకు వీరుడు లేక మరో చిత్రమో తరహాలో ఆ హీరోలు చాలా పొగరుతో ఉంటారు. కానీ అక్కడ కూడా మన వాళ్లే ఉంటారు. వాళ్లూ మనలాగే ఉంటారని నేటివిటీ టచ్ తో నేర్పరితనంగా ఎన్నారైలని కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

ఇప్పుడు తెలుగులో సమంత..గోల్డెన్ లెగ్..ఆమె ఉందంటే సినిమా సూపర్ హిట్ అనే నిర్ణయానికి వచ్చేసారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర మేరకు ఆమె చేసుకుంటూ పోయింది. రొమాంటిక్ ఏంగిల్ ..పవన్ జల్సా తరహాలో ఈ సినిమాలో పెద్దగా లేకపోయినా ఓకే అనిపించింది. మోడ్రన్ గర్ల్ గా ప్రణీత కూడా బాగా చేసింది. బాపు గారి బొమ్మో పాటను ప్రణీత మీద చక్కగా చిత్రీకరించారు. మరదళ్లు ఇద్దరూ సినిమాటెక్ గా సాగిపోయారు.

బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. కధా సెటప్ కి అవసరమైన ఈ పాత్రకి ఆయన బాగా న్యాయం చేసారు. అయితే ఈ తరహా పాత్రలు మన వాళ్లు (కైకాల సత్యనారాయణ,కోట శ్రీనివాసరావు వంటివారు) తెలుగులోనూ ఇంతకన్నా బాగా చేయగలరని నిరూపించి ఉన్నారు

త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫన్ కి లోటు ఉండదనేది సగటు సిని ప్రేక్షకుడుకి తెలిసిన విషయం. అలాంటిది కామెడీ సీన్స్ లో రెచ్చిపోయే పవన్ వంటి వారు అండగా ఉండగా ఇంకేంటి అన్నట్లు చాలా సీన్స్ హిలేరియన్ గా తీర్చి దిద్దారు. ముఖ్యంగా బ్రహ్మానందం..బంధం భాస్కర్ గా అదరకొట్టారు. ఇక పవన్ ..బ్రహ్మీని ఆటపట్టించటానికి కెవ్వు కేక బాబాగా మరో కామెడీ ఎపిసోడ్..ఇలా నవ్వులు పేర్చుకుంటూ పోయారు.

గతంలో వాణిశ్రీ,నగ్మా,రమ్యకృష్ణ,లక్ష్మి వంటివారు అందాలు ఒలకబోస్తూనే అత్త పాత్రలో జీవించారు. మళ్లీ రీసెంట్ గా నదియా ఆ పాత్రను పోషించి వారిని గుర్తు తెచ్చింది. డీసెంట్ గా ఆమె చేసిన నటన హైలెట్ అయ్యింది. పవన్ కి, ఆమెకూ మధ్య వచ్చే సన్నివేసాలు బాగున్నాయి. అలాగే ఆమె భర్తగా వేసిన రావు రమేష్ కూడా క్యారక్టర్ కి యాప్ట్ అయ్యారు. ముఖేష్ రుషి కూడా ఓకే.

‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' క్లైమాక్స్ లో వచ్చే డైలాగు ఇది. దీన్ని బట్టే ఎంత బాగా దీన్ని డీల్ చేసాడో అర్దం చేసుకోవచ్చు. సినిమాకి చివరి ఇరవై నిముషాలు ప్రాణం అని సినిమా పెద్దలు చెప్తూంటారు. అదే ఈ సినిమాకు నిజమైంది. క్లైమాక్స్ లో పవన్ చెప్పే డైలాగులు, నదియా,పవన్ మధ్య వచ్చే సన్నివేసం సినిమాకు ప్లస్ అయ్యింది. అప్పటి వరకూ సరదాగా సాగిన జర్ని ఆ సీన్ తో టర్న్ తీసుకుని సినిమాని నిలబెట్టింది. సె8కండాఫ్ లో కొంత సాగిన ఫీలింగ్ వచ్చినా ఈ సీన్ తో మళ్లీ రైట్ ట్రాక్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ తన రచనా చాతుర్యం ఇక్కడ ఉపయోగపడింది

దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు సినిమాకు బాగా ప్లస్ అవుతాయని ఆడియో రిలీజ్ అయిన రోజే అందరికి అర్దమైంది. అలాగే అతను సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం కొన్ని సీన్స్ కు ప్రాణం పోసింది. అటు సంప్రదాయ బద్దంగానూ, ఇటు మోడ్రన్ గానూ రెండు వైపులా పదునున్న కత్తిలా దేవి రెచ్చిపోయారు. ముఖ్యంగా దేవదేవం సినిమాలో హైలెట్.

కెమెరా వర్క్ అద్బుతం కాదు కానీ ఓకే అనిపించింది. గ్రాఫిక్ వర్క్ బాగోలేదు.ఎడిటింగ్ బాగా క్రిస్పిగానే ఉంది కానీ సెకండాఫ్ లో కొన్ని చోట్ల బాగా స్లో అయిన ఫీలింగ్ వచ్చేసింది. దాన్ని మరింత జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే బాగుండేది. ఆర్ట్ డిపార్టమెంట్, కాస్ట్యూమ్స్ రెండూ సినిమాకు ప్రాణమై నిలిచాయి. మిగతా క్రాప్ట్ లన్నీ సినిమా కు తగ్గట్లే ఉన్నాయి.

 

Posted

.

Avuna? Aithe okasari Ayana rasini nayak racha AD 1 movies review vei ekkada

vesaa bhayya suneeell3.gif?1289983772

Posted

.

Avuna? Aithe okasari Ayana rasini nayak racha AD 1 movies review vei ekkada

baa esa  ba

Posted

 

movie sudakunda genuine ane padam vadakudadu kada bemmi.look.gif

4s086h.gif?1403646236

 

 

 

serry gadi rotta cinemalaki leni edupu.. ntr cinemalaki undundi yeeeeeeeeeeeeeeeeee bemmi.look.gif

Posted

serry gadi rotta cinemalaki leni edupu.. ntr cinemalaki undundi yeeeeeeeeeeeeeeeeee bemmi.look.gif

anti fanism 4s086h.gif?1403646236

Posted

sinema chusinava4s086h.gif?1403646236

 

routine rotta cinemalu sudanu ani ottu pettukunna bemmi.look.gif

×
×
  • Create New...