Jump to content

Ys Jagan Vs Chandrababu War Of Words In Ap Assembly


Recommended Posts

Posted

The AP assembly witnessed the heated debate between the ruling TDP led by CM Chandrababu and the leader of the opposition and YSRCP chief YS Jagan over the issue of BCs. YS Jagan faulted the ruling TDP, Speaker Kodela for not giving the opportunities to him and his leaders to speak over the issue of BCs, where as CM Chandrababu while reacting to it has faulted Jagan and his leaders for not possessing the rules and procedures of assembly and parliament. 

Posted
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, శాసనసభ నియమాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా ఏ అంశంపైనైనా ప్రకటన చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన తెలిపారు. రూల్స్ బుక్ చదివితే అన్నీ తెలుస్తాయని బాబు సూచించారు. తొలిసారి ఎన్నికైన ప్రతిపక్షనేతలు దౌర్జన్యం చేసి సాధించుకుందామంటే కుదరదని ఆయన తెలిపారు. మీ ఇష్టం మీ ఇంట్లో చెల్లుబాటవుతుందని, శాసనసభలో కుదరదని ఆయన స్పష్టం చేశారు.

 

Posted

ప్రతిపక్ష నేత జగన్ శాసనసభ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్ష నేత తొలిసారి శాసనసభకు హాజరైన నేపథ్యంలో సభా సంప్రదాయాలు తెలియవని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేత తన లక్షణాలు ఇతరులకు ఆపాదించాలంటే ఎలా? అని యనమల ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన శాసన సభ్యులకు శిక్షణ ఇచ్చామని ఆయన చెప్పారు. ఆ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే సంప్రదాయాలు తెలిసేవని ఆయన అన్నారు.

Posted
ఇంత దారుణమైన రాజకీయాలను తానెప్పుడూ చూడలేదని వైఎస్సార్సీపీ నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీసీలపై తీర్మానం పెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పక్ష సభ్యులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికార పక్ష నేతలకు మానవత్వం ఉందా? లేదా? అనే విషయం తరచి చూసుకోవాలని ఆయన సూచించారు. 

బీసీల గురించి మాట్లాడితే అడ్డు తగులుతారా? అని ఆయన మండిపడ్డారు. బీసీలపై సశాస్త్రీయమైన చర్చ జరగాలని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలకు ఏం చేశాయి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అనే వాటిపై చర్చించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దశలో సభలో అధికారపక్ష సభ్యులు ఆందోళన చేశారు.

 

Posted
బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, చేతి వృత్తులకు టీడీపీ ఆదరణ కల్పిస్తుందన్నారు. చేతి వృత్తుల వారు ఎవరైనా గాయపడితే లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామని అన్నారు. అలా కాకుండా ఎవరైనా మృతి చెందితే ఎన్నికల్లో ప్రకటించినట్టు రెండు లక్షలు కాకుండా, 5 లక్షల రూపాయలు పరిహారంగా అందజేస్తామని అన్నారు. 

ఆదరణ పథకం కింద కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. చేతి వృత్తులకు సేవల పన్ను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చేతి వృత్తుల వారికి ఇళ్ళు కేటాయిస్తామని అన్నారు. చేనేతలను ఆదుకుంటామని అన్నారు. గీత కార్మికులను ఆదరిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మత్స్యకారులు మర పడవల్లో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకోవడానికి డీజిల్ అందజేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు. 

చేపల వేట ఆగినప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే ఏడేళ్ల తరువాత లక్ష రూపాయలు నష్టపరిహారం అందజేస్తున్నారని, దానిని మార్చి రెండేళ్లకే ఐదు లక్షల రూపాయలు అందేలా చొరవ తీసుకుంటామని అయన తెలిపారు. అలాగే ప్రభుత్వం తరపున గొర్రెల విక్రయకేంద్రాలు పెడతామని ఆయన వెల్లడించారు.

రజకులకు దోభీఘాట్ లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. పుట్టువెంట్రుకలు తీసే నాయీ బ్రహ్మణులచేత బ్యూటీ సెలూన్లు పెట్టించే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. బీసీల్లో చాలా కులాలు ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారని, దానిని కూడా పరిశీలిస్తామని ఆయన వివరించారు. ఈ మేరకు టీడీపీ తీర్మానం చేస్తుందని ఆయన తెలిపారు.

 

Posted

jagan will make b babu work .. it is good for the state ... 

 

which state ?? clarity please ?? amav20.gif?1368598550

Posted

thanks chepplai Jagan ki.. ladies serials choostharu..manam news choosi hayiga navvuko vachu..live entertainment bavuntundi..

Posted

thanks chepplai Jagan ki.. ladies serials choostharu..manam news choosi hayiga navvuko vachu..live entertainment bavuntundi..

 

yes man .. entertainment tho paatu babu ki responsibility guruthuchesthunaadu .. it is good ... 

Posted

yes man .. entertainment tho paatu babu ki responsibility guruthuchesthunaadu .. it is good ...


Ila anna anukoni satisfy avvandi mari lol
×
×
  • Create New...