Jump to content

Lol Revanth....


Recommended Posts

Posted

జనం మోసపోవాలని కోరుకుంటారు.. నిజం చెబితే నమ్మరు గతంలో సంస్కరణలంటే బాబును ఓడించారు.. అందుకే ఇప్పుడు మేం ఉచితం అన్నాం అమెరికా వచ్చినప్పుడన్నా నిజాలు మాట్లాడాలె
నాటా సభలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

revath.jpgహైదరాబాద్, సెప్టెంబర్ 8: మొత్తం దేశ ప్రజలంతా రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలని కోరుకుంటారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో రాజకీయ నాయకులు కరప్ట్ అవడానికి తమ బాధ్యత ఎంత ఉందో.. అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజలకుందని చెప్పారు. ఉచితం అంటేనే జనం ఓట్లేశారని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని అట్లాంటాలో నాటా ఏర్పాటు చేసిన రీస్ట్రక్టరింగ్ తెలంగాణ అనే కార్యక్రమంలో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

ప్రజలకు మేం నిజం చెబితే నమ్మరు. నిజం చెప్పడం వారికి ఇష్టం ఉండదు అని రేవంత్ ఆ వీడియోలో అన్నారు. హామీల్లో చెప్పినట్లుగా ఉచితంగా ఇవ్వడానికి తామేమీ తమ సొంత ఆస్తులు అమ్మి ఇవ్వబోమని చెప్పారు. నేను నా ఆస్తి అమ్మను. మా బాస్ అమ్మడు. కేసీఆర్ అమ్మడు. జగన్ అమ్మడు. ఎవరి ఆస్తి? అల్టిమేట్‌గా మీ నుంచే గుంజుకుంటాం. ఆ మాత్రందెల్వదా? ఎందుకు మాతో అబద్ధాలు చెప్పిస్తారు? అని ప్రశ్నించారు. ఉచితంగా ఇవ్వాలంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి, వాటినే ఇస్తామని చెప్పారు.

అందుకే ఆరు వేల కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు 30వేల కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్లు కోరుకున్నప్పుడు మాదేముంది? రోగి కోరుకున్నదదే. డాక్టర్ ఇచ్చిందదే అన్నట్లుంది యవ్వారం. ప్రజలు అనవసరమైన వాటిని ఆశించొద్దు అన్నారు. చంద్రబాబు 2004 వరకు సంస్కరణలు అవసరమని భావించి ఉచితం వద్దని ఒక లైన్ తీసుకుంటే 40 సీట్లకు పడగొట్టారని గుర్తు చేశారు. అదే రాజశేఖర్‌రెడ్డి అన్నీ ఉచితమంటే ఆయన పార్టీకి 240 సీట్లు ఇచ్చారని అన్నారు. 2009లో అందరూ అటూఇటుగా చెప్పారని, ఇప్పుడు దాదాపు అందరూ అదేలైన్‌లోకి వచ్చారని అన్నారు. దీనిపై చంద్రబాబు వెనక్కితిరిగి చూసుకుంటే ఉచితం అనే పాపులర్ స్లోగన్‌కు ఓటేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో ఉచితం అనే పదం కారణంగా ఓట్లు పోగొట్టుకున్నామని భావించిన చంద్రబాబు.. ఈ సారి ఎన్నికల్లో అదే స్లోగన్‌తో వచ్చారని చెప్పారు.

ఇందులో తప్పొప్పులకు ఆస్కారం లేదని, ఎవరైతే 51శాతం ఓట్లు తెచ్చుకుంటారో ప్రజాస్వామ్యంలో వారే కుర్చీ ఎక్కుతారని అన్నారు. ప్రజలు మారాలా? లేక రాజకీయ నాయకులు మారాలా? అన్న ప్రశ్నకు.. రాజకీయ నాయకుడికి సొంతంగా ఏ అభిప్రాయమూ ఉండదు. గెలవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. గెలవడానికి ఏది పనికొస్తే అదే చెబుతం. ఇప్పుడు తెలంగాణ అంటే గెలుస్తుమనుకుంటే తెలంగాణ అన్నరు. రేపు భవిష్యత్తులో ఇంకో పదం వాడితే ఉపయోగం అయిద్దంటే ఇంకో పదం వాడుతం. అల్టిమేట్‌గా రాజకీయ నాయకుడికి గెలుపు ముఖ్యం అన్నారు. ప్రజలు తమ చేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారు కానీ.. తామేవారిని మోసం చేయడం లేదని చెప్పారు. కీలకమైన ఆరోగ్యం, తాగునీరు, విద్యవంటి విషయాలను ప్రభుత్వమే చేపట్టాలని, అది ప్రభుత్వాల బాధ్యతన్న రేవంత్.. వాటి కోసం ప్రభుత్వాలను ప్రజలు నిలదీసి పని చేయించుకోవాలని అన్నారు. అంతేకానీ ఉచితం అనకూడదని అన్నారు.

ఇప్పుడు చివరాఖరుకు ఏం మిగిలిందేంటంటే.. మేం వండి వడ్డించడం తప్ప అన్నీ ఉచితం అని చెప్పేశాం. వండి వడ్డిస్తేకూడా లేదు. లేదు. నువ్వు నమిలిపెట్టు అనే కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మమ్మల్ని ఆ వైపు డ్రైవ్ చేయకండి అని ప్రజలకు చెప్పారు. దేశంలో లేను కాబట్టి ఇక్కడైనా నిజం చెబుదామని ఈ విషయాలు చెబుతున్నానని అన్నారు. అక్కడికి పోతే మళ్లీ అదే చెబుతాను. అక్కడికి వచ్చి ఇదే అడిగితే ఇదేమీ చెప్పను. అట్లనే చెబుతా అన్నారు. మీరు మాట్లాడేది లైవ్‌లోనని సంధానకర్త గుర్తు చేయగా.. చూడొచ్చు.. కనీసం మా సారు అమెరికాకు పోయినప్పుడైనా నిజం మాట్లాడిండనుకుంటరు అని రేవంత్ బదులిచ్చారు.

×
×
  • Create New...