timmy Posted September 13, 2014 Report Posted September 13, 2014 నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిందూపురంలో ఆర్టీసీ నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన స్వయంగా బస్సు నడిపారు. ఈ బస్సులను ఆర్టీసీ సిబ్బంది విరాళాలతో కొనడం విశేషం. కాగా, ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అనంతపురం రీజియన్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
timmy Posted September 13, 2014 Author Report Posted September 13, 2014 కాలేజి ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులకు బాలకృష్ణ సందేశం 05:33 PM హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం పట్టణంలోని సప్తగిరి కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలుగువారి విశిష్టతను దేశవిదేశాల్లో చాటాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో తాము ముందుకువెళుతున్నామని తెలిపారు. మహిళల శక్తిని గుర్తించి, వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎన్టీఆరేనని బాలయ్య ఉద్ఘాటించారు.
saradagakasepu Posted September 13, 2014 Report Posted September 13, 2014 janam lo ki baga thiruguthunnadu ga...good job
Recommended Posts