Jump to content

No Celebrations On Completing 100 Days C B N ..no One Can Do Better


Recommended Posts

Posted

వంద రోజుల ఉత్సవాలను తాను జరపుకోవడం లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి తాము శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. ఇంతకన్నా బాగా వంద రోజులలో చేయడం ఇబ్బందేనని ఆయన అన్నారు.తమ ప్రభుత్వం ఈ వంద రోజులలో చేసిన వివిధ కార్యక్రమాలను బుక్ లెట్ ద్వారా తెలియచేశామని అన్నారు. విద్యుత్ అబివృద్దికి ఎంతో మూలం అని , దానిని ఇరవైనాలుగు గంటలు ఇవ్వడానికి కేంద్రంతో ఒప్పందం కదుర్చుకున్నామని అన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను తొమ్మిది శాతానికి తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అదికారుల కేటాయింపే జరగలేదని ఆయన అన్నారు.కేంద్రంతో విద్యుత్ కు సంబందించి ఒప్పందాలను కుదుర్చుకున్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎపికి ఈ ప్రాజెక్టు ఇచ్చినందుకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హీరో ప్రాజెక్టుకు నెల్లూరు జిల్లాలో 600 ఎకరాల భూమి ఇస్తున్నామని, దానిని సత్వరమే నిర్మాణం పూర్తి చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని ఆయన చెప్పారు.

 
Posted

GOOD GOING CBN..

 

bl@st  bl@st  bl@st bl@st

×
×
  • Create New...