Jump to content

Recommended Posts

Posted

10534756_10152482033673640_1046198831567

Renowned mandolin player Uppalapu Srinivas died on Friday at a private hospital in Chennai. He was 45.

According to a source at Apollo hospital, where he was admitted following brief illness, Srinivas "passed away due to liver-related problems this morning at 9.30".

Born on February 28, 1969 in Palakolu, Andhra Pradesh, Srinivas was a child prodigy. He picked up his father's mandolin at the age of six and started playing it.

He made his first public performance at the age of 9 when he played at the Thyagaraja Aradhana Festival in Gudivada.

Since then, he has performed in several music festivals, both nationally and internationally.

He has performed alongside several international artists such as Michael Brook, John McLaughlin, Trey Gunn and Nigel Kennedy.

In 1998, he was honoured with the Padma Shri award. He's also the recipient of the prestigious Sangeeta Ratna award.



 
Posted

Was a genius. Brought a western instrument like the electronic mandolin into Carnatic classical music. Pioneer of sorts. May he RIP _/|\_

Posted

RIP but who is he , Never heard of him...

Posted

RIP but who is he , Never heard of him...

devi sri prasad guru

Posted

RIP but who is he , Never heard of him...

 

సెప్టెంబర్ 19 : విఖ్యాత మాండలిన్ వాద్యకారుడు, ఆ వాయిద్యాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభాశీలి మాండలిన్ శ్రీనివాస్ ఇక లేరు. కాలేయ సంబంధిత వ్యాధితో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇక్కడి అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు.

mandalin.jpg కొద్దిరోజలుగా ఆయన అనారోగ్యంతో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాండలిన్ వాయిద్యానికి మారుపేరుగా నిలిచిన శ్రీనివాస్‌ను ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ, సంగీతరత్న పురస్కారాలతోపాటు అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. ఉప్పలపు శ్రీనివాస్ ఆయన పూర్తిపేరు. మాండలిన్‌తో తన తొలి ప్రదర్శనను శ్రీనివాస్ తన తొమ్మిదవ ఏటనే ఇచ్చారు. అనతికాలంలోనే అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్.. ఎలక్ట్రిక్ మాండలిన్‌ను ఉపయోగించేవారు. జాన్ మెక్‌లాఫ్‌లిన్, మైఖేల్ నైమన్ వంటి ప్రపంచస్థాయి కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. సత్యసాయిబాబాకు భక్తుడైన శ్రీనివాస్ ఆయన ముందు అనేక సందర్భాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రధాని మోడీ సంతాపం
మాండలిన్ శ్రీనివాస్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో గొప్ప సంగీత విద్వాంసుడిగా ఆయన గుర్తుండిపోతారని మోడీ ట్వీట్ చేశారు. మాండలిన్‌ను ప్రజలకు పరిచయం చేసిన విద్వాంసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభివర్ణించారు. ఆయన మృతి కర్ణాటిక్ సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. మాండలిన్ వాయిద్యంతో భారతదేశానికి ప్రఖ్యాతిని తీసుకొచ్చారని తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ సంతాపం
మాండలిన్ శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చిన్నవయసులోనే ప్రతిభాపాటవాలు చూపి పద్మశ్రీలాంటి ఉన్నత అవార్డులు పొందిన ఆయన, సంగీతానికి విశేష సేవ చేశారని కొనియాడారు.

mandalinTT.jpgనివ్వెరపోయిన సినీ, సంగీత ప్రపంచాలు
సినీ, సంగీత ప్రపంచాలు కూడా మాండలిన్ శ్రీనివాస్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కర్ణాటిక్ వెలుగుల తార మాండలిన్ శ్రీనివాస్‌జీ మృతి వార్త నన్ను తీవ్రంగా కుదిపివేసింది. తదుపరి ప్రపంచంలో ఆయనకు దేవుడు సంతోషాలు ప్రసాదించుగాక అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. మరో ఆస్కార్ విజేత రోసుల్ పోకుట్టి కూడా శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృపట్ల గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, తబలా మాంత్రికుడు జాకీర్ హుస్సేన్, గాయని శ్రేయా ఘోషల్, సంగీత దర్శకుడు సలీమ్ మర్చంట్ తదితరులు సంతాపం తెలిపారు.


బాల మేధావి
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 28న ఉప్పలపు శ్రీనివాస్ జన్మించారు. చిన్నతనం నుంచే మాండలిన్ వాయిద్యంపై పట్టు సాధించారు. శ్రీనివాస్ తన తండ్రి సత్యనారాయణ కూడా మాండలిన్ వాద్యకారుడే. ఆయన వద్ద ఉన్న మాండలిన్‌పై తన ఆరవయేటనే శ్రీనివాస్ సరాగాలు పలికించారు.

తండ్రి అతడికి తొలి గురువయ్యారు. అనంతరం కాలంలో తన తండ్రికి గురువైన రుద్రరాజు సుబ్బరాజు వద్ద శ్రీనివాస్ శిష్యరికం చేశారు. శ్రీనివాస్ సోదరుడు రాజేశ్ కూడా మాండలిన్ విద్వాంసుడే. 1978లో తన తొలి ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన శ్రీనివాస్, మూడేండ్ల తర్వాత ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన మద్రాస్ మ్యూజిక్ సీజన్‌లో ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టారు. 1983లో బెర్లిన్‌లో జరిగిన జాజ్‌ఫెస్ట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అనంతరం కెనడా నుంచి ఆస్ట్రేలియా వరకూ అనేక దేశాల్లో పర్యటించి, మాండలిన్ గొప్పతనాన్ని చాటారు. 1988లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సత్కరించింది. 2010లో సంగీత నాటక అకాడెమీ అవార్డు వరించింది. ప్రఖ్యాత సంగీత రత్న అవార్డు కూడా ఆయనకు లభించింది. పశ్చిమదేశాల కళాకారులైన మైఖేల్ బ్రూక్, జాన్ మెక్‌లాఫ్‌లిన్, నిగెల్ కెన్నడీ, ట్రే గున్, మైఖేల్ నైమన్‌తదితరులతో కూడా వేదిక పంచుకున్నారు. భారతదేశంలో హిందూస్థానీ క్లాసికల్ సంగీత విద్వాంసులైన హరిప్రసాద్ చౌరాసియా, జాకీర్‌హుస్సేన్‌లతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు.

×
×
  • Create New...