Jump to content

Recommended Posts

Posted

క‌మర్షియ‌ల్ సినిమాలో కొత్త‌ద‌నం వెతుక్కోవ‌డం
డొమినోస్‌కి వెళ్లి దిబ్బ‌రొట్టి ఆర్డ‌ర్ చేయ‌డం రెండూ ఒక్క‌టే.
వండిన‌ క‌థ‌నే మ‌ళ్లీ తిర‌గేసి మ‌ర‌గేసి వండేస్తాం అని తీసిన సినిమానే తీస్తుంటే - ప్రేక్ష‌కులు విసిరి అవ‌త‌ల పాడేస్తున్నారు.
క‌నీసం ఆగ‌డు అయినా డిఫ‌రెంట్ సినిమాకి డెఫినీష‌న్‌లా ఉంటుందంటే...  ఆగ‌డుదీ అదే  ''
దూకుడు''. గ‌త నాలుగైదేళ్ల‌లో తీసిన సినిమాలు, చూసిన సినిమాలు క‌లేసి, మెలేసి, పిండేసి, ఆరేసి.. దానికి ఓ స‌రికొత్త టైటిల్ పెడితే... అదే ''ఆగ‌డు''.
బోర్ కొచ్చిన బండికి రిపేర్లు చేసి, రంగులేసిన‌ట్టు.. ఓ పాత క‌థ‌కు రంగులేసే ప్ర‌య‌త్నం చేస్తే.. అదే
 ''ఆగ‌డు''.
దూకుడు తీస్తున్న‌ప్పుడు అందులో కొన్ని సీన్లు మిగిలిపోతే... వాటికి ఇంకొన్ని సీన్లు జోడించి తీస్తే.. అదే
''ఆగ‌డు''.

క్యాచ్ చేసే టాలెంట్ ఉంటే...  ఈ సినిమాలో ఓ స‌రికొత్త పాయింట్ దొరికేస్తుంది.
ఇది వ‌ర‌కు సినిమాల్లో హీరో విల‌న్ ని మాత్ర‌మే బ‌క‌రా చేస్తాడు.. కానీ ఈ సినిమాలో
హీరో విల‌న్‌నీ
విల‌న్ త‌మ్ముడ్ని
విల‌న్ చుట్టుప‌క్క‌ల‌వాళ్ల‌ని
త‌న స్టేష‌న్‌లో ఉన్న ఎస్సైని
బ్ర‌హ్మానందాన్ని,
ఆఖ‌రికి హీరోయిన్ని కూడా బ‌క‌రానీ, బ‌క‌రీని కూడా చేసేస్తాడు. 
ఒక బ‌క‌రానే చూళ్లేక ఛ‌స్తుంటే.. మేక‌ల మంద‌ని వెంటేసుకొచ్చాడు.. మ‌హేష్ బాబు.  

×
×
  • Create New...