Jump to content

Another Rude Shock To Kcr On Metro...!


Recommended Posts

Posted

హైదరాబాద్‌ మెట్రోపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ 
మొదటి దశ అలైన్‌మెంట్‌లో మార్పులు కష్టం
మార్పులు చేయాలంటే చట్టం చేయాలి : కేంద్రం

 

 

 
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 : హైదరాబాద్‌ మెట్రోపై కేంద్రం మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి దశ అలైన్‌మెంట్‌లో మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎల్‌ అండ్‌ టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్య వివాదం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రోకు సంబంధించి మొదటి దశకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
 
గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత... ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి రూట్‌ కారిడార్‌ 1, కారిడార్‌ 2, కారిడార్‌ 3. ఈ మూడు కారిడార్‌లపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ అధికారులు గెజిట్‌ నోటిపికేషన్‌ ఇచ్చారు. ఇందులో ఏమైనా అలైన్‌మెంట్‌ మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా మార్పులు చేయాలంటే కేంద్రం పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాతే అలైన్‌మెంట్‌ను మార్చవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. వెలివేటెడ్‌ కారిడార్‌ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటుందని, టీ. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా అసెంబ్లీ ముందు, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ మెట్రో లైన్‌ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇచ్చిన మ్యాప్‌ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని, అలైన్‌మెంట్‌లో మార్పులు ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. టీ.సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా నిన్న ఢిల్లీ వచ్చి, హోంశాఖ, పీఎంఓ అధికారులతో మెట్రోపై చర్చలు జరిపారు. వారు అనుకున్న విధంగా జరుగుతుందని భావించారు. ఒక్క రోజులోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు గెజిట్‌ నోటిపికేషన్‌ విడుదల చేశారు. ఎల్‌ అండ్‌ టీ, తెలంగాణ ప్రభుత్వం మద్య వివాదం కారణంగానే కేంద్రం ఈ గెజిట్‌ నోటీసును విడుదల చేసినట్లుగా తెలియవచ్చింది. ఇక మెట్రో నిర్మాణం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోదలిస్తే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాకే..

 

Posted

Doola therindhi

 

Delhi vellina vallu vennakki ika.kvlr.gif

Posted
‘మెట్రో అలైన్‌మెంట్ మార్పు స్వేచ్ఛ రాష్ర్టానికి ఉంటుంది’
Updated : 9/23/2014 9:31:34 PM
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్‌మెంట్ మార్చుకోవచ్చు. ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ స్పష్టంచేసింది. హైదరాబాద్ మెట్రోపై ఆశాఖ స్పందిస్తూ.. మెట్రో రైల్ అలైన్‌మెంట్ విషయంలో ఎల్&టీ వివాదంతో గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధం లేదు. హైదరాబాద్ మెట్రో మొదట ట్రామ్ వేస్ యాక్ట్‌లో ఉండేది. 2014 ప్రారంభంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాజాగా సెంట్రల్ మెట్రో యాక్ట్‌లోకి చేర్చామని పట్టణాభివృద్ధిశాఖ పేర్కొంది. దీంతో అలైన్‌మెంట్ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.
×
×
  • Create New...