Jump to content

Pawan Kalyan Gopala Gopala Shooting @hyd


Recommended Posts

Posted
మిడ్‌నైట్‌‌లో పవన్‌ హంగామా పవన్‌కల్యాణ్ మిడ్‌నైట్‌లో హంగామా చేశాడా..? వినడానికి విచిత్రంగా వున్నా ముమ్మాటికీ నిజమే! అనుకోకుండా హైటెక్ సిటీ సమీపంలో అర్థరాత్రి ఈ హీరో కనిపించడంతో ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. పవన్ లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’ మూవీ షూటింగ్ ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌కల్యాణ్‌ బైక్‌‌పై ఛేజింగ్ ‌సీన్ను షూట్ చేసినట్టు సమాచారం. వీటికోసం ఫారిన్ నుంచి బైక్ను తెప్పించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి బైక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ సభ్యులంటున్నారు. ఇందులో పవన్‌తోపాటు వెంకటేష్ కూడా పాల్గొన్నట్లు టాక్. ఈ క్రమంలో ఆ రోడ్డు మీదగా అటువైపు వెళుతున్నవారికి పవన్‌కల్యాణ్ కన్పించాడు. క్షణాల్లో ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల జనాలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. చాలామంది అయితే స్మార్ట్ ఫోన్‌లో షూటింగ్ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి బంధించేందుకు పోటీపడ్డారు. జనాలను అదుపు చేయడం చిత్ర యూనిట్‌కి కష్టంగా మారింది. మొత్తానికి ఎలాగోలా యూనిట్ సభ్యులు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.
 
1453327_725810537486975_6302773585554606
×
×
  • Create New...