Jump to content

Recommended Posts

Posted

కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించి పండ్ల రసాలను తాగితే రైతులను ఆదుకున్నవారవుతారని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కర్ణాటకలోని తుమ్కూర్ లో ఫుడ్ పార్క్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోకోకోలా, పెప్సీ లాంటి బహుళజాతి కంపెనీలు తమ శీతల పానియాల ఉత్పత్తులతో పాటు, పండ్ల రసాల ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. 

భారతీయ రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేయడం ద్వారా రైతుల అభివృద్ధికి దోహద పడిన వారవుతారని ఆయన సూచించారు. శీతల పానియాల కంపెనీలు కోట్లలో వ్యాపారం చేస్తుండగా, పండ్ల వ్యాపారం బాగా జరగడం లేదని ఆయన తెలిపారు. పండ్లు, పండ్ల రసాలు తాగడం ద్వారా ఆరోగ్యం పెంపొందించుకోవడంతో పాటు, రైతాంగాభివృద్ధి కూడా జరుగుతుందని ప్రజలు గుర్తించాలని మోడీ సూచించారు.

Posted

monna emo india lo chesina crakers konandi ani cheppadu

 

sound pollution authadi crakers thagginchandi ani cheppe badulu

 

 

this is good

×
×
  • Create New...