Jump to content

Recommended Posts

Posted

తెలంగాణ ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలతో ప్రజలను ఆకట్టుకోవడం మానేసి వేధింపులు, బెదిరింపులు, బుజ్జగింపులతో ఇతర పార్టీల వ్యక్తులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతల వ్యాఖ్యలకు బలం చేకూరే సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. భూపాలపల్లిలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కార్యాలయం ఎదుట ఓ రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన తనను, టీఆర్ఎస్ లోకి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తాను ఒత్తిడికి లోను కాకపోవడంతో, వేధింపులకు దిగారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

×
×
  • Create New...