Jump to content

Recommended Posts

Posted
   ఇదో కొత్త యాప్... మెరుగైన శృంగారానుభవానికి ప్రత్యేకం!      05:15 PM
సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతోంది. శారీరక, మానసిక అవసరాలకు తగ్గట్టు యాప్ లు రూపొందించడంలో పరిశోధకులు విశేషమైన కృషి చేస్తున్నారు. అమెరికాలో యువతను లక్ష్యంగా చేసుకుని 'గుడ్2గో' పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. పరస్పర అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునేవారు 'గుడ్2గో' యాప్ ను వినియోగించుకుంటే సేఫ్ గా ఉంటుందని యాప్ రూపకర్త లీ ఆన్ అల్మాన్ తెలిపారు. 

ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైసెస్ లలో దీనిని వినియోగించుకోవచ్చని ఆయన వెల్లడించారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనాలని భావించే యువత సందేహాలు, భయాలకు ఈ యాప్ సమాధానం లాంటిదని ఆయన చెప్పారు. యాప్ లోకి వెళ్లగానే 'ఆర్ వి గుడ్2గో' అని అడుగుతుందని, 'యస్' అని సమాధానమిస్తే సమాచారం అందజేస్తుందని, 'నో' అని సమాధానమిస్తే సమాచారం ఇవ్వడం నిలిపేస్తుందని ఆయన తెలిపారు

 

×
×
  • Create New...