Jump to content

Poem On Dasara 2014 By Srinivas Kanchibhotla


Recommended Posts

Posted

02 October 2014
Hyderabad

నాస్తి

ఉన్న గుణాలు రెండు - మంచి, చెడు
ఉన్న గణాలు రెండు - ఆడ, తేడ
ఈ నలుపేటల పడుగూ పేకల వింత నేతలో
ఒక్కొక్క వర్ణానిదొక అర్ధం
ఒక్కొక్క వర్గానికొక పరమార్ధం
ఉన్న దారులు రెండు - భక్తి, కత్తి
ఉన్న దూరాలు రెండు - సాయుజ్యం, సామ్రాజ్యం
ఈ నలుచదరాల జీవన చదరంగములో
మిడిసిపాట్ల కప్పదాట్ల భంగపాట్లు
ఉన్నచోట్ల ఉన్నంతలో ఉన్నతాలు

యుగాల తరబడి చెడునెంత నిర్జించ చూచినా
గుణ సమీకరణల నుండి తనని తరమ తరము కాలేదు
పుణ్య కథల పేరిట మంచినెంత ప్రోత్సహించినా
అందనలవి కానివి చిత్తమును స్థిరమున నిలువ నీయలేదు
మనిషి అస్థిత్వమునకు ఆనవాళ్ళు పరుగు ఆరాటాలు
వీటితో ప్రాపంచికమునకు పరిమితమాయెనా చరిత్రలో మిగిలిపోవును
కాక అలౌకికమును ఆకాక్షించెనా పురాణాల నిలిచిపోవును
ఆదిశక్తిని చూచి చెడు సమసిపోలేదు
మహిషుడికి భయపడి మంచి జడిసిపోలేదు
సృష్టి సంతులనంలో తక్కెడల తైతక్కలివి
అంతే తెలియని ఆర్ణవంలో ఆటుపోటుల ఆట ఇది

 

 

×
×
  • Create New...