Ruler4Dmasses Posted October 2, 2014 Report Posted October 2, 2014 నిరాకారము లో కొలువైన అపరశక్తి స్వరూపము లొకహితము కై, జగత్ రక్షకై పరాశక్తి గ వచ్చెను అనంతమైన నిడివిన విస్తరించిన విస్వంబున అణువులో అణువంత కనులలో చూచెంత రూపమున స్మరణమాత్రము చేతనే మనోఫలకమున దర్శనం ఇచ్చావు విశ్వమంత వేదికపై, వినీల గగనభువనాల వాటికపై విచిత్ర విన్యాస ఖేళి సలిపి, విస్మయ గొలిపే విశ్వమున భక్తీ విశ్వాసమును లీలా మాత్రమున నిలిపిన జగజ్జనని యెట్లు కీర్తించగలమో అనువారికి అక్షరమాలిక ఇచ్చి యెవ్విదముగ కొలుతుమో అనుకొంటుండగా ఋషుల మేధకు వేద శాస్త్రరూపముల నిచ్చి సకల ప్రాణికోటికి అక్కరకువచ్చునట్లు పశుపక్ష్యాదులకు సస్య శ్యామల గ్రాసవాతిక సృజించి జలతరులు నివాసము కొరకు మహాసముద్ర కొలనులు ఏర్పరిచి పెక్కు విధములైన ప్రాణికోటిని,సమన్వయపరిచి జీవన్ముక్తి సమాహార లోగిల లో ఊగిస లాట లో కర్మ భరిత కడలి లో, కరుణా కటాక్ష దీవనేలిచ్చే అమ్మవి కంచి కామాక్షి, మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి, కోట సత్తెమ్మ, బెజవాడ కనక దుర్గమ్మ,మావూళ్ళమ్మ, కొండాలమ్మ,
Ruler4Dmasses Posted October 2, 2014 Author Report Posted October 2, 2014 DB janulellariki Vijayadasami subhaakaankshalu
Recommended Posts