rapchik Posted October 3, 2014 Report Posted October 3, 2014 A Sreenu Vaitla Film : ఆగడు ప్రజలారా.. తెలుగువారిగా మనందరికీ తెలుసు మహేష్ బాబు కి మేకప్ అక్కర్లేదనీ, శ్రీనువైట్ల సినిమా కి స్టోరీ అక్కర్లేదనీ, మనం కామెడీ మాత్రం మనం కనెక్ట్ అయిపోతామనీ. కానీ నెత్తి మీద పిడుగు పడినప్పుడూ,పాము కాటేసినప్పుడూ, గేదె పేడేసినప్పుడూ ఒకటే మంత్రం వేస్తానంటే జుత్తు కాలిపోయి, నోట్లోంచి నురగలొచ్చేసి, సీన్ కంపు కొడతాది... సినిమా తీసినోళ్ళకీ, చూసినోళ్లకీ కూడా.! ఆ తర్వాత ఇదిగో... ఇట్టాంటి పోస్టులు చదవాల్సిన కర్మ పడతాది మీకు.చిన్న ఊక దంపుడు కార్యక్రమంఃగుడుంబా శంకర్ తో మొదలయ్యి ఫెయిలయిన ఒక స్టోరీ టెంప్లేట్ నీ, మార్పులు చేసి బంపర్ హిట్ లు కొట్టిన ఘనత శ్రీమాన్ శ్రీను వైట్ల దే. అది ఎలాంటి ఘనతంటేప్రస్తుతం తెలుగు సినిమాలకి డైరెక్టర్లు వేరై ఉండొచ్చు, హీరోలు మారి ఉండొచ్చు, హీరోయిన్లు కామన్ అయి ఉండొచ్చు, రైటర్లకీ, డైరెక్టర్లకీ పడకపోయి ఉండొచ్చు, విడిపోయి విడివిడి గా దాడి చెయ్యొచ్చు కానీ "ఆవు వ్యాసం" లాగా అదే టెంప్లేట్. ఈ ఎదవ ఫార్ములా పుణ్యమా అనీ తెలుగు హీరోలు కమెడియన్లు గానూ, హీరోయిన్లు , ఐటెం నంబర్లు గానూ, విలన్లు బఫూన్లు గానూ, కమెడియన్లు హీరోలుగానూ రూపాంతరం చెందారు. హరిశ్చంద్రుడి జీవిత చరిత్రైనా, సిపాయిల తిరుగుబాటు కధ అయినా ఈ టెంప్లేట్ లో పెట్టాకఒకలాగే తయారవుతాయి.ఉదాహరణకి రామాయణాన్ని సినిమాగా తీయమని వీళ్ల చేతిలో పెడితే ఈ కమర్షియల్ టెంప్లేట్ లో పెట్టి, అవసరం అనుకుంటే కామెడీ బిట్లు హిందీ సినిమాల నుండీ, కాన్సెప్ట్ కొరియా సినిమా నుండీ, ఫైట్లు హాలీవుడ్ సినిమా నుండీ లేపేసి కలిపేసి పులిహోర చేసి హిట్ చేసెయ్యగలరు.సపోజ్... పర్ సపోజ్... ఇదే శ్రీనుగారికి మహేష్ బాబుని రాముడుగా పెట్టి రామాయణాన్ని తీయమంటే......... అది ఈ ఆవు వ్యాసం టెంప్లేట్ లో ఇల్లా అవుతుంది. (గమనికః ఇదో భయంకరమైన, మా చెడ్డ ఊహ మాత్రమే. నాకు రామాయణం అంటే ఇష్టం, గౌరవం)సినిమా బిగినింగ్ లో బాల రాముడు-దశరధుడి మీద రెండు సెంటిమెంట్ సీన్లు, అడవి లో ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ తో కామెడీ, సీత తో పరిచయం-డ్యూయెట్, సూర్పణఖ తో లక్ష్మణుడి ఐటెం సాంగ్.(క్షమించాలి)ఇంటర్వెల్ బ్యాంగ్ కి రావణాసురిడి తో చాలెంజ్, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ (దీనికి లాజిక్కులతో పని లే..!!) బ్రహ్మానందాన్ని బకరాని చేసి, ఆ అడ్డెట్టుకొని రావణాసురిడింట్లో మకాం. విలన్ గ్యాంగ్ ని మొత్తాన్నీ వెధవల్ని చేసి, ఇంద్రజిత్ తో ఫైటింగ్ చేసీ చంపేసీ,చివరాఖర్న రావణాసురిడి లో మార్పు తెచ్చి, శాంతిని నెలకొల్పి సీతని విడిపించుకొని శుభం కార్డ్ వేసి, టికెట్ రేటు వందా, ధియేటర్లు వెయ్యీ పెంచి ఫస్ట్ వీక్ కలెక్షన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తారు. ఈ వారం రోజులూ టీవీ నైన్ లో లైవ్ షో దగ్గర నుండీ దూరదర్శన్ లో పందుల పెంపకంప్రోగ్రాం దాకా గెస్ట్లు గా వీళ్ళే ఉంటారు. ఏ రియాలిటీ షో జూసినా ఏమున్నది గర్వకారణం.. హిట్టయిన సీరియల్ ఆర్టిస్టులూ, ఫ్లాపయిన సినిమా బృందాల ఓవరాక్షన్లూ తప్ప. ఆ సినిమాని ఏ పండక్కో టీవీ లో వేసే లోగా, యూట్యూబ్ లో పెట్టే లోగా బస్సు యాత్రా, నా వల్లకాడు యాత్రానూ..!!అసలు సంగతి వదిలేశాను. కీలక మైన పంచ్ డైలాగులు. ఇప్పుడు SuperStar in & as శ్రీరాముడు గా అద్దిరి పోయే పంచ్ డైలాగ్స్. [మరే.... పంచ్ డైలాగుల ప్రభావం జనాల మీద గట్టి గానే ఉంది]మధ్య మధ్య లో ముక్కు ఎగబీలుస్తూ...కీచు గొంతుతో.... రవణా...(రావణా) ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.... బాణం దిగిందా లేదా ?రవణా..... మధురై ని కాపాడ్డానికి మీనాక్షమ్మ ఉందీ.. నా సీత ని కాపాడుకోడానికి నేనున్నానుబాణం తీశాకా.. బ్లైండ్ గా వేసెయ్యటమే (నీ దూకుడూ... సా...టెవ్వడూ... )విభీషణుడు హ్యాండిచ్చాడంటగా.. మండోదరి హ్యాపీసా? యుద్ధా.......నికొస్తున్నారంటగా? గెలుపూనాదే సీతా నాదే... ఎప్పుడిస్తున్నావ్ సీతనీ ఆ .....?పడుకున్న పులినీ, వనవాసం చేసుకుంటున్న నన్నూ కెలికితే..... వేటేదూకుడు లేకపోతే ఈ రాముడుకీ కీ ఆ రావణుడికీ తేడా ఏం ఉంటదీ?నేను యుద్దానికొస్తే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలిబాణాలకి బెదరని బాడీ రా నాదీ..!మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు "మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూకుడు లో వేపుడైపోద్ది బతుకూ.. అని"విల్లు చూడాలనుకో.... తప్పులేదు.. కానీ బాణాన్ని చూడాలనుకోకు చచ్చిపోతావ్.
rapchik Posted October 3, 2014 Author Report Posted October 3, 2014 lol Come to this thread full story undhi http://www.andhrafri...i-ledha-anadhi/
Recommended Posts