timmy Posted October 9, 2014 Report Posted October 9, 2014 https://www.youtube.com/watch?v=s4qqBVdPXF8
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 Talasani Srinivas Yadav and Teegala Krishna Reddy met KCR again today. Talasani speaking to media said after new state formation in democratic way, going by the recent political activities they are always asked to talk against TRS party. The power problem which is blamed on TRS government is wrong as it came to power only recently. He alleged Krishnapatnam thermal power station though ready is not inaugurated to stop power to Telangana. He said that they are unhappy on bus yatra and appointing Lokesh to oversee Telangana TDP. Talasani summed up saying they are unhappy about all these and extend their support to TRS.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 Five leaders from the TDP have joined the TRS party today and those include four MLAs and one MLC . MLAs Teegala Krishna Reddy , Talasani Srinivas Yadav , Dharma Reddy , Praksh Goud and MLC Gangadhar Goud have decided to join the TRS after the meet with Telangana CM KCR . The leaders stated that they wanted to become the part of Bangaru Telangana and alleged Chandrababu role for the power woes in Telangana and questioned the bus yatra against the Telangana Government .
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 https://www.youtube.com/watch?v=hkLbNxyA8zU
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. నిన్నటి శత్రువు... ఇవ్వాళ మిత్రుడు కావచ్చు. అలాగే, నిన్నటి స్నేహితుడు, ఈరోజుకి శత్రువు అయిపోవచ్చు. రాజకీయాల్లో శాశ్వత సంబంధాలు, అనుబంధాలు చాలా తక్కువని చరిత్ర చెబుతున్న సత్యం. ఇదంతా చెబుతుంది పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గురించి. తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్ ఎమ్మెల్యే), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం ఎమ్మెల్యే), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్ ఎమ్మెల్యే), ధర్మారెడ్డి (పరకాల ఎమ్మెల్యే)టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిలో, ధర్మారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఆయన నిర్ణయం టీడీపీ వర్గాలతో పాటు విలేకరులను సైతం ఆశ్చర్యానికి గురిచేేసింది. గత కొంతకాలంగా, ధర్మారెడ్డి చంద్రబాబుకు గట్టి మద్దతుగా నిలిచారు. కొన్ని రోజుల క్రితం ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లోకి వెళుతున్నారనే విషయాన్ని ఆయనే టీడీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశారు. తనను కూడా టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా ఎర్రబెల్లి ఆహ్వానించారని, అయితే ఈ ప్రతిపాదనను తాను నిర్ద్వందంగా తోసిపుచ్చానని. టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొంది, టీఆర్ఎస్ లోకి వెళ్లడం అనైతికమని... తాను జీవితాంతం టీడీపీలో్నే కొనసాగుతానని ఆయన విలేకరులకు అధికారంగా, అనధికారికంగా స్పష్టం చేశారు.మరీ ముఖ్యంగా, నిన్ననే విలేకరులు సమావేశంలో కేసీఆర్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ కు పరిపాలించడం చేతగాక, ప్రతీదానికి చంద్రబాబు విమర్శించడంగా సరికాదని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కరెంట్ విషయంలో కేసీఆర్ కేంద్రాన్ని సంప్రదించలేదని, తెలంగాణలో రైతులు కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్నా భేషజాలకు పోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా విద్యుత్ కోసం రిక్వెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము బస్సుయాత్ర చేపడుతున్నామని ఆయన నిన్న వ్యాఖ్యానించారు .అయితే, నిన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన ధర్మారెడ్డి ఈ ఉదయం కేసీఆర్ ను కలిసిన తర్వాత హఠాత్తుగా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయంచుకోవడం, తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నానని అనడం విలేకరులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా, వారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరనే విషయాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ పై పార్టీలో నానాటికీ అసంతృప్తి రాగాలు పెరిగిపోతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇటు తెలంగాణలోనూ లోకేశ్ తీరుపై నేతలు నొసలు చిట్టిస్తున్నారు. చంద్రబాబు ఏకైన సంతానమైన లోకేశ్, అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత, గడచిన ఎన్నికల సందర్భంగా తండ్రికి చేదోడువాదోగా నిలిచారు. పలు కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏపీలో పార్టీ విజయంలో ఆయనది కొంత పాత్ర ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్నికలు ముగిసి ఏపీలో అధికారం చేపట్టడం, తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. అయితే తాజాగా లోకేశ్ వ్యవహార సరళిపై ఇరు రాష్ట్రాల్లోని ముఖ్య నేతలు లోలోపలే రగిలిపోతున్నారు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి, వెంటనే తెలంగాణ పార్టీ పగ్గాలు చేపడతామంటే, తామంతా పనికిరానివారమనేగా మీ ఉద్దేశ్యమంటూ సతన్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగానే తన బాధను వెళ్లగక్కారు. మరోవైపు రెవెన్యూ శాఖ బదిలీలకు సంబంధించి లోకేశ్ చేసిన ఫిర్యాదుతో చంద్రబాబు స్పందించిన తీరుపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లోలోపలే రగిలిపోతున్నారు. భవిష్యత్తులో లోకేశ్ వల్ల మరిన్ని కొత్త సమస్యలు వచ్చిపడే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నగరంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తీగల కృష్ణారెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండటంతో పార్టీలో కలవరం మొదలైంది. నిన్నటిదాకా పార్టీని వీడిన నేతలపై విమర్శలు గుప్పించిన టీడీపీ, తాజాగా నోరు మెదిపేందుకే వెనుకాడుతోంది. తలసాని బృందం పార్టీని వీడటం ఆ పార్టీ తెలంగాణలో చేపట్టనున్న యాత్రలపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపనుందని విశ్లేషణలు సాగుతున్నాయి. పార్టీలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు, టీటీడీపీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం బాధ కలిగించింది: తలసాని 11:53 AM అవును, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సమావేశాలంటూ తమను పిలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేయిస్తోందనీ, ఇలా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం బాధ కలిగించిందనీ అన్నారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం అన్న తలసాని, 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి వస్తుందనే కృష్ణపట్నం థర్మల్ కేంద్రాన్ని ప్రారంభించ లేదని ఆరోపించారు. ఇక తెలంగాణలో బస్సు యాత్రలకు వెళ్లాలనడం దురదృష్టకరమన్నారు. లోకేష్ కు తెలంగాణలో పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారని, టీడీపీకి ఇక్కడ నాయకత్వమే లేదా? అని తలసాని ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నామని చెప్పారు.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 టీఆర్ఎస్ లో తలసాని, తీగల చేరిక ఖరారు 11:40 AM టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు తాము పార్టీలో చేరనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంప్ కార్యాలయంలో కలసిన వారు పార్టీలో చేరేందుకు అంగీకరించారు. కొన్ని రోజుల నుంచీ ఈ ఐదుగురు టీడీపీని వీడుతున్నట్లు ఊహాగానాలు, వార్తలు వచ్చినా నేటితో ఆ అనుమానాలకు తెరపడింది.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 https://www.youtube.com/watch?v=GZ2z0h9I0JE
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 లోకేష్ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరిస్తున్నారు: ఎల్.రమణ 03:39 PM టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలి, టీడీపీ ఎమ్మేల్యేలను టీఆర్ఎస్ లోకి ఆకర్షించే పనిలో పడిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పై తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ టీడీపీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా మాత్రమే ఆయన పనిచేస్తున్నారని వెల్లడించారు. లోకేష్ ను తప్పుపడితే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
timmy Posted October 9, 2014 Author Report Posted October 9, 2014 Talasani Srinivas Yadav, Sanathnagar MLA who quit TDP and joined the ruling TRS after meeting CM KCR blasted TDP chief and AP CM Chandra Babu Naidu.He said Chandra Babu instead of strengthening the party in Telangana, started blaming ruling TRS party for the current problems of the state. He said it was Babu who is responsible for refusing to share power with Telangana.He said instead of trying to solve the internal problems of the party, Babu always tried to thrust the leadership of Lokesh on Telangana TDP as if there are no capable leaders from Telangana to lead the party.He said even today morning when he met Chandra Babu, he asked them to take Bus Yatra to solve the problems of Telagnana farmers and current problems of the people which looked ridiculous. He said Chandra Babu instead of trying to train T-TDP to work for Bangaru Telangana, is making party leaders to work for Lokesh which is unacceptable to him. - See more at: http://www.gulte.com/news/31507/Talasani-Blasts-Chandra-Babu#sthash.zg62epVb.dpuf
Recommended Posts