Jump to content

Recommended Posts

Posted
మొటిమలు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య      05:23 PM
చాలా చిన్న విషయాలకు కూడా యువత తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. క్షణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని అకారణంగా తనువు చాలిస్తున్నారు. ఇండోర్ లో నిధి మాల్వియా (22) అనే యువతికి ముఖంపై అందర్లాగే మొటిమలు వచ్చాయి. అయితే అవి ఎంతకూ పోవడంలేదు. మొటిమల్ని మాయం చేస్తాయంటూ టీవీల్లో ప్రకటించిన ఎన్నో క్రిములు వాడినా ఫలితం లేకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందుతూ ఉండేది. 

మొటిమలు తగ్గేలా లేవని, మొటిమలు తగ్గకపోవడం వల్ల అందంగా కనిపించడం లేదని భావించిన ఆ యువతి విషం తీసుకుంది. ఆత్మహత్యాయత్నం తరువాత విపరీంతగా వాంతులవడం గమనించిన ఆమె తల్లిదండ్రులు యువతిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది.

 

Posted

endhi vayya idi...pranam viluva thelikunda pothundi janalaki

×
×
  • Create New...