timmy Posted October 13, 2014 Report Posted October 13, 2014 ఇదీ హుదూద్ తుపాను ప్రభావం 09:04 PM హుదూద్ తుపాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 మండలాల్లో 117 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలోని 2 మండలాల్లోని 22 గ్రామాల్లో తుపాన్ తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. విశాఖపట్టణంలోని 11 మండలాల్లోని 103 గ్రామాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని వారు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 78 గ్రామాల్లో తుపాను బీభత్సం సృష్టించిందని అధికారులు స్పష్టం చేశారు. తుపాన్ ధాటికి 6,695 ఇళ్లు నేలమట్టం కాగా, 109 చోట్ల రైల్వే ట్రాక్, రోడ్లు దెబ్బతిన్నాయి. 19 కాల్వలకు గండ్లు పడగా, 181 బోట్లు గల్లంతయ్యాయి.
Recommended Posts