timmy Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్ రావాలంటే 4000 విమానంలో కాదు బస్సులో 03:36 PM సప్లయ్ డిమాండ్ సూత్రాన్ని ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు బాగా ఒంటబట్టించుకున్నారు. అందినకాడికి పిండుకుని ప్రయాణికులు జేబులకు చిల్లు పెడుతున్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాదు రావాలంటే సాధారణ పని దినాల్లో నాన్ ఏసీ 600 రూపాయలు, ఏసీ 800 రూపాయలు ఇక వారాంతాల్లో నాన్ ఏసీ 800, ఏసీ 1000 రూపాయలు ఛార్జీలు సాధారణంగా ఉంటాయి. వారం రోజులుగా విశాఖపట్టణానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ట్రావెల్ ఏజెంట్ల పంటపండింది. వైజాగ్ నుంచి హైదరాబాదు రావాలంటే 4000 రూపాయలు చెల్లించాల్సిందే. విశాఖ నుంచి బెంగళూరుకు 5000 రూపాయలు, చెన్నైకి 4500 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు వైజాగ్ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. జేబులు చిల్లుపడుతున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లు పెంచిన ఛార్జీల కంటే విమానాల్లో ఆయా పట్టణాలకు వెళ్లడం సులువని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే విమాన, రైల్వే సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అమాంతం రేట్లు పెంచేసి వసూలు చేసుకుంటున్నారు. ఇంత వరకు ఆయా పట్టణాలకు రాత్రిపూట మాత్రమే సర్వీసులు నడిపే ఆపరేటర్లు ఇప్పుడు పగలు సర్వీసులు కూడా ప్రారంభించారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన బస్సులతో సర్వీసులు నడుపుతున్నట్టు సమాచారం. విశాఖ నుంచి పరిమిత ఆర్టీసీ సర్వీసులు ఉండడంతో ప్రైవేటు ఆపరేటర్ల పంటపండింది.
Recommended Posts