timmy Posted October 15, 2014 Report Posted October 15, 2014 హుదూద్ తుపాను నష్టం వివరాలివే 05:13 PM హుదూద్ తుపాను నష్టం వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తుపాను కారణంగా 35 మంది మృతి చెందగా, వారిలో విశాఖ వాసులు 25 మంది, విజయనగర వాసులు 8 మంది, శ్రీకాకుళం వాసులు ఇద్దరున్నారు. 43 మందికి గాయాలు కాగా, 146 మందిని సహాయక బృందాలు కాపాడాయి. మొత్తం 3,098 పశువులు మృతి చెందాయి. తుపాను ధాటికి లక్షా 82 వేల 128 హెక్టార్ల పంట నేలమట్టమైపోయింది. మొత్తం 7,871 ఇళ్లు ధ్వంసం కాగా, 8,439 విద్యుత్ స్తంభాలు విరిగిపోయి పనికిరాకుండా పోయాయి. 219 చోట్ల రోడ్లు, రైలు పట్టాలు దెబ్బతినడంతో సుమారు 2,250 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. మొత్తం 73 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా, మొత్తం నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయి
Recommended Posts