Jump to content

Janasena Head Pawan Kalyan On Ap Cm Chandrababu Naidu


Recommended Posts

Posted
ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాశానికెత్తేశారు. చంద్రబాబుకు ఉన్న పాలన అనుభవంతోనే హుదూద్ తుపాను నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించగలిగామని పవన్ అన్నారు. క్లిష్ట సమయాలను విజయవంతంగా ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని కితాబిచ్చారు. బాబు నాయకత్వ లక్షణాలు అమోఘమని... ఆయన పనితీరు చాలా బాగుందని అన్నారు. సమర్థ నాయకుడనే నమ్మకంతోనే ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని పొగడ్తలతో ముంచెత్తారు. సమర్థుడైన వ్యక్తి అధికారంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. విశాఖలో చంద్రబాబుతో కలసి పవన్ మీడియాతో మాట్లాడారు.

తుపాను విరుచుకుపడుతోందన్న వార్తలు వచ్చినప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా వ్యవహరించిందని పవన్ కొనియాడారు. ప్రజలు కూడా సమయానుకూలంగా బాగా స్పందించారని అన్నారు. హూదూద్ తుపాను విశాఖకు కలిగించిన నష్టం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను సహాయక చర్యలకు తక్షణ సాయం అందించిన ప్రధాని మోడీకి, అద్భుతంగా సహాయక చర్యలను చేపడుతున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

 

Posted
 
చంద్రబాబుకు చెక్ అందజేసిన పవన్ కల్యాణ్     11:42 AM
తుపాను బాధితుల సహాయార్థం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పవన్... సీఎం సహాయనిధికి 50 లక్షల చెక్ అందజేశారు.

 

Posted

Emo PK - 50 Lakhs = mostly Ram Saran 25 Lakhs + Jr NTR 20 Lakhs + Prabhas 20 Lakhs + Singer Smitha 5 Lakhs

Ani antunnar.

×
×
  • Create New...