Jump to content

Recommended Posts

Posted
 
వికలమైన మనసుతో సీఎం చంద్రబాబు చెమటోడ్చారు      05:03 PM
కైలాసగిరి విశాఖను సందర్శించేందుకు వచ్చే ఎవరైనా సందర్శించే ప్రముఖ పర్యాటక ప్రాంతం. కైలాసగిరిపైకి ఎక్కిన చిన్నపిల్లలు తమ ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది అని వెతుక్కుంటారు. పెద్దవాళ్లు ప్రకృతి పారవశ్యాన్ని అనుభవిస్తూ తన్మయత్వం చెందుతారు. అలాంటి కైలాసగిరిని హుదూద్ తుపాను కకావికల చేసింది. పచ్చని చెట్లతో అలరారిన కైలాసగిరి నాగలితో దున్నేసి చెట్లను వేళ్లతో పెకలించివేసినట్టు అయిపోయింది. 

దీనిని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు. రాడార్ కేంద్రం స్థితిగతులు తెలుసుకున్న సీఎం ఆ చెట్లను చూసి అలా నిల్చోలేకపోయారు. పని వాళ్ల చేతుల్లో రంపం తీసుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న కొమ్మలను కోశారు. ఆ ప్రాంతం చదును చేసేందుకు శ్రమించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే చెమటోడుస్తుంటే సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పనులు చేశారు.

 

×
×
  • Create New...