Jump to content

Fans Frustrating Me: Pawan Kalyan


Recommended Posts

Posted

2ueka36.jpg

 

‘ఎందుకు సినీ నటుడ్ని అయ్యానా అన్పిస్తోంది..’ ఇదీ విశాఖలో తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆవేదన. సినీ నటుడ్ని కాకపోయి వుంటే.. చీపురు పట్టుకుని పనిచేయగలిగేవాడిని.. ఆ అవకాశం లేకుండా పోయిందని పవన్‌కళ్యాణ్‌ వాపోయాడు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడినా.. విశాఖలో మీడియాతో మాట్లాడినా.. మీడియా ప్రతినిథుల హంగామా.. అభిమానులు ప్రదర్శించిన వెర్రి అభిమానం.. ‘సినీ తారలు రాకపోతేనే మంచిదేమో..’ అన్న అభిప్రాయాన్ని కలగజేసింది.

 

రాజకీయ నాయకుల పర్యటనలకూ హంగామా వుంటుంది గానీ.. మరీ ఈ స్థాయిలో కాదు. పవన్‌కళ్యాణ్‌ తాను ప్రయాణిస్తున్న వాహనం దిగి బాధితులతో మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు, పవన్‌కళ్యాణ్‌కి రక్షణ కల్పించడానికే నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఇక పవన్‌, బాధితుల్ని ఎలా ఓదార్చగలుగుతారు.? పవన్‌ సంగతి సరే.. ఈ రోజు సాయంత్రం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తుపాను బాధితులను ఓదార్చడానికి వెళ్తున్నారు కదా.. ఆయన పరిస్థితెలా వుంటుందో మరి.!

 

 

బాలకృష్ణ అయినా, పవన్‌కళ్యాణ్‌ అయినా, రామ్‌చరణ్‌ అయినా.. ఇంకో నటుడైనా పరిస్థితి ఇలానే వుంటుంది. సమస్య తీవ్రత నేపథ్యంలో ఎవరి అభిమానులైనా సంయమనం పాటించాల్సి వుంటుందిక్కడ. ‘బాధితుల్ని పరామర్శించడానికి వస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయింది..’ అని పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో నూటికి నూరుపాళ్ళూ నిజం వుంది. అభిమానుల అభిమానం.. స్టార్స్‌కే చిరాకు తెప్పిస్తోందంటే.. అభిమానులు ఇప్పటికైనా తాము చేస్తున్నది తప్పో ఒప్పో అర్థం చేసుకోవాలి. పవన్‌ టూర్‌లో హంగామా నేపథ్యంలో బాలయ్య టూర్‌ అయినా బాధితుల్ని ఓదార్చేలా సాగుతుందని ఆశిద్దాం.
 

Posted

   eeni M .. evadu kammanadu actor.. 

flowerism membership expire ainda endhi itta antunnav brahmismoking.gif

Posted

flowerism membership expire ainda endhi itta antunnav brahmismoking.gif

 

brahmismoking.gif  kaledu kaadu man life time membership vundi

Posted

how rude ..  $s@d

 

brahmi46.gif   ivala rude ga behave chedam ani decided

×
×
  • Create New...