Jump to content

Krishna Family Donated 1.5 Crores


Recommended Posts

Posted

81413801087_625x300.jpg
 
 
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం సినిమా నటుడు గట్టమనేని కృష్ణ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటి 50 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఈ రోజు కృష్ణ-విజయనిర్మల దంపతులు సీఎంను కలిశారు. తమ అల్లుడు, గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ తరపున కోటి రూపాయలు, తమ కుటుంబం తరపున 50 లక్షల రూపాయలు మొత్తం కలిపి ఒకే చెక్కుగా అంజేశారు.

అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్ బాబు హాంకాంగ్ షూటింగ్లో ఉన్నందున రాలేకపోయినట్లు తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చెప్పారు. విశాఖ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. తుపాను బాధితులకు తన సానుభూతి తెలిపారు.

×
×
  • Create New...