Jump to content

Recommended Posts

Posted
 
తెలంగాణలో ప్రతి సమస్యకు నేనే కారణం అంటే ఎలా? ఏపీ సీఎం     06:11 PM
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు, రైతుల సమస్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటున్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు ధీటుగా సమాధానమిచ్చారు. విద్యుత్ రాకపోయినా, నీళ్లు రాకపోయినా నేనే కారణమంటే ఎలా అని మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. రేపు టీఆర్ఎస్ వారు ఇంట్లో కాపురం చేయకపోయినా నేనే కారణం అంటారేమోనని ఎద్దేవా చేశారు. ఇక కరవుకు కూడా నేనే కారణం అవుతానా అని బాబు ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఇలా గిల్లికజ్జాలు పెట్టుకోవద్దని సూచించారు. విద్యుత్ విషయంపై సరిగా మేనేజ్ చేయలేక తమపై తప్పులు నెడతారా అని అడిగారు. నల్గొండలో తమ పార్టీ కార్యాలయాన్ని ఎలా తగులబెడతారని సూటిగా నిలదీశారు. టీడీపీ కృషి వల్లే తెలంగాణ, హైదరాబాదులో ఆదాయం పెరిగిందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునని సీఎం పేర్కొన్నారు.

Posted
పెదాలపై చిరునవ్వు, కడుపులో విషం... ఇదే చంద్రబాబు నైజం: హరీశ్ రావు      06:00 PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెదాలపై నవ్వు, కడుపులో విషం... ఇదే చంద్రబాబు నైజమని ఆరోపించారు. వెన్నుపోట్లు, మోసం తదితర అంశాల్లో బాబుకు డాక్టరేట్ ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. విద్యుత్ విషయంలో గవర్నర్ వద్దకు వెళ్ళిన కాంగ్రెస్ నేతలను విమర్శించేందుకు టీడీపీ నేతలకు మాటలు రావడంలేదని అన్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణ రాష్ట్రానికే ఉందని హరీశ్ రావు ఉద్ఘాటించారు. కృష్ణా రివర్ బోర్డు సందేహాలకు తాము జవాబిచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు.

Posted

CBN Said - TS lo current problems ki nenae karnam , water problems ki nenae karnam and TS lo sariga kapuralu chyaka pothae nenae karnam antae ela 

Posted

తెలంగాణలో ప్రతి సమస్యకు నేనే కారణం అంటే ఎలా? ఏపీ సీఎం     06:11 PM
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు, రైతుల సమస్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటున్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు ధీటుగా సమాధానమిచ్చారు. విద్యుత్ రాకపోయినా, నీళ్లు రాకపోయినా నేనే కారణమంటే ఎలా అని మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. రేపు టీఆర్ఎస్ వారు ఇంట్లో కాపురం చేయకపోయినా నేనే కారణం అంటారేమోనని ఎద్దేవా చేశారు. ఇక కరవుకు కూడా నేనే కారణం అవుతానా అని బాబు ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఇలా గిల్లికజ్జాలు పెట్టుకోవద్దని సూచించారు. విద్యుత్ విషయంపై సరిగా మేనేజ్ చేయలేక తమపై తప్పులు నెడతారా అని అడిగారు. నల్గొండలో తమ పార్టీ కార్యాలయాన్ని ఎలా తగులబెడతారని సూటిగా నిలదీశారు. టీడీపీ కృషి వల్లే తెలంగాణ, హైదరాబాదులో ఆదాయం పెరిగిందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునని సీఎం పేర్కొన్నారు.

Nuvvu kojj@ gaa puttadaaniki kooda neney kaaranam aa...?  -- CBN @3$%

×
×
  • Create New...