Jump to content

Cbn And Venkaiah Naidu Attend 'toofanni Jayiddam' Rally At Vishaka


Recommended Posts

Posted
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా విశాఖ: చంద్రబాబు     08:31 PM
విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. సంకల్పం, పట్టుదల ఉంటే, ఏమైనా సాధించే సత్తా తెలుగు ప్రజలకు ఉందని, వారి సహకారంతోనే విశాఖను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని ఆయన బుధవారం ఆత్మవిశ్వాస ర్యాలీలో భాగంగా పేర్కొన్నారు. హుదూద్ తుఫానే అసూయ పడేలా నగరాన్ని తీర్చిదిద్దుదామని, ఇందులో ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖను పురోభివృద్ధి బాటలో నడిపించేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీని మరిపించేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, అప్పటిదాకా నిద్రపోనని ఆయన శపథం చేశారు.

 

Posted
విశాఖ... ఏపీకి ఆయువుపట్టు: చంద్రబాబు     08:01 PM
అందమైన సుందర నగరంగా ప్రసిద్ధిగాంచిన విశాఖ, ఆంధ్రప్రదేశ్ కు ఆయువుపట్టులాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హుదూద్ తుఫాను కారణంగా నగరం విధ్వంసానికి గురైందని, అయితే నగరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతామని ఆయన ప్రకటించారు. తుఫాను బాధితుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. విశాఖకు వీలయింనంత మేర సాయం చేసేందుకు వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారన్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి ఆర్థికంగానే పారిశ్రామిక పరంగానూ రాజధానేనని ఆయన అన్నారు.

 

Posted
చంద్రబాబు... నిజమైన ప్రజా సేవకుడు: వెంకయ్యనాయుడు     07:54 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజమైన ప్రజా సేవకుడని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతున్న ఆత్మవిశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల గుండె నిబ్బరాన్ని పొగిడారు. హుదూద్ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసిన వైనం ఫ్రధానిని ఆకట్టుకుందని ఆయన తెలిపారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ప్రాంతానికి పునర్వైభవం తీసుకొచ్చేదాకా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

 

Posted
  విశాఖ వాసుల గుండె నిబ్బరం అమోఘం: వెంకయ్యనాయుడు     07:44 PM
విశాఖ వాసులు, హుదూద్ తుఫానుకు ఎదురొడ్డి నిలిచిన వైనం అమోఘమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో కొనసాగిన ఆత్మ విశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన విశాఖ వాసుల గుండె నిబ్బరాన్ని కీర్తించారు. విశాఖ వాసుల ఆత్మ విశ్వాసం దేశానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల కృషి ఫలితంగా విశాఖకు పూర్వ వైభవం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Posted
కాగడాల వెలుగులో ఆర్కే బీచ్!     07:27 PM
విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ బుధవారం సాయంత్రం కాగడాల వెలుగులతో నిండిపోయింది. తుఫాను బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఏపీ సర్కారు చేపట్టిన ఆత్మ విశ్వాస ర్యాలీలో భాగంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు సహా రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత రెట్టించిన ఉత్సాహంతో ఈ ర్యాలీలో కాగడాలు చేతబట్టి ముందుకు కదులుతోంది. స్వయంగా చంద్రబాబు, మంత్రులు కాగడాలు చేతబట్టారు. ర్యాలీ నేపథ్యంలో ఆర్కే బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది.

 

×
×
  • Create New...