Jump to content

Recommended Posts

Posted
భార్య సంరక్షణ చూసుకోకపోతే జైలుకే: ఢిల్లీ కోర్టు     08:54 PM
కన్నవారిని వదిలి, ఎంతో నమ్మకంతో మెట్టినింట అడుగుపెట్టే భార్య మంచి చెడ్డలు, సంరక్షణ చూసుకోవలసిన బాధ్యత భర్తదే అని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. భార్యను మానసికంగా, శారీరకంగా హింసించిన నేరానికి ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే, 2012లో కాలిన గాయాలతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు భర్తను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించేందుకు సాక్ష్యాధారాలు సరిగా లేవని తెలిపింది. అయితే, తన కూతురుని అల్లుడు ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని మృతురాలి తల్లి కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. భార్యలను ప్రేమాభిమానాలతో చూసుకోవాల్సిన బాధ్యత భర్తలకు ఉందని వ్యాఖ్యానించింది.

 

Posted

mari husband somrakshani ki chatta undha? appudu women ni jaiil ki pampisthaara???  :3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

 

×
×
  • Create New...