Jump to content

Recommended Posts

Posted
విద్యుత్ కొనుగోలు ఫైలు తిప్పి పంపలేదని చెప్పమనండి... ఆధారాలు బయటపెడతా: రేవంత్      05:58 PM
తెలంగాణలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతుండగా, ముఖ్యమంత్రి రాజకీయ సాధింపుల పేరిట ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాగి ఉన్నాడో లేదో తెలియదు కానీ పత్రికా ప్రతినిధుల సమావేశంలో అచ్చం తాగిన వ్యక్తిలా మాట్లాడారని అన్నారు. 

ల్యాంకో విద్యుత్ సంస్థ 150 మెగావాట్ల విద్యుత్ అమ్మడానికి సంసిద్దత వ్యక్తం చేయగా, సీఎంవో అధికారులు ఆ ఫైలును సీఎం వద్దకు పంపితే దానిని ఎందుకు తిప్పి పంపారో ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లగడపాటితో ఉన్న రాజకీయ వైరం, లంచమివ్వలేదన్న కారణంగా ల్యాంకో నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆయన వివరించారు. 

కేసీఆర్ దీనిని అబద్ధమని చెబితే నిజమైన ఆధారాలు బయటపెడతానని రేవంత్ సవాలు విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో 82 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ నష్టం జరిగిందని, దీంతో, తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 608 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని, దీనికి బాధ్యత ఏపీ సీఎం బాబు వహించాలని, లేని పక్షంలో కోర్టు కీడుస్తామని కేసీఆర్ మీడియా సమావేశం పెట్టమరీ అరిచి గీపెట్టాడని ఆయన విమర్శించారు. 

మొత్తం అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను టీడీపీపై కేసీఆర్ ఉసిగొల్పుతున్నాడని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే నిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటా దక్కలేదని ఓ పేపర్ పట్టుకుని నోటికొచ్చిన అబద్దాలు కేసీఆర్ చెప్పాడని ఆయన ఆరోపించారు. 

ఒకే మీడియా సమావేశంలో కేసీఆర్ నాలుగు సార్లు మీడియా మిత్రులకు సారీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సారీ చెప్పడంతోనే వాస్తవం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఆయన చెప్పారు. కేసీఆర్ అబద్ధాలపై నిగ్గు తేల్చి వాస్తవాలు వెలుగులోకి తేనున్నట్టు ఆయన తెలిపారు. గత నాలుగున్నర నెలలుగా (జూన్ 18 నుంచి అక్టోబర్ 23 వరకు) మొత్తం 10,717 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,031 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకోగా, 5,686 మిలియన్ యూనిట్ల ధర్మల్ విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుందని ఆయన వివరించారు. 

అలాగే, నీటి ద్వారా ఉత్పత్తవుతున్న 3,798 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా 1571 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ వినియోగించుకోగా, తెలంగాణ 2226 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకుంది. ఆ విధంగా 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రం అదనంగా వినియోగించుకుందని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం విద్యుత్ లో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయి తెలంగాణకు త్యాగం చేయగా, తెలంగాణ రాష్ట్రం 273 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను అదనంగా వాడుకుందని ఆయన వివరించారు. ఈ లెక్కన నష్టపోయింది ఎవరు? లాభం పొందింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యల పరిష్కారానికి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండని అన్ని పార్టీలు చెబుతూనే ఉన్నాయని, అయినప్పటికీ దున్నపోతుమీద వర్షం పడ్డట్టు ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. సమస్యల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే బస్సు యాత్ర చేపట్టామని ఆయన వెల్లడించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ క్యాంపాఫీసులో కాలక్షేపం చేస్తూ... అధికారులను పండగల పేరు చెప్పి కల్లు కాంపౌండ్ల చుట్టూ తిప్పుతుంటే తప్పని టీడీపీ విమర్శించిందనీ, అలా విమర్శించడం తప్పా? అని ఆయన నిలదీశారు.

లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ 1400 కోట్ల రూపాయాలు వెచ్చించి 900 మెగావాట్ల విద్యుత్ ను 5.30 పైసలు లెక్క ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కుంటే, తెలంగాణ సీఎం మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విభజన సందర్భంగా ఆస్తులు, ఆప్పులు జనాభా ప్రాతిపదికన విభజించినా, విద్యుత్ కు కొత్త విధానం అమలు చేస్తే, సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై అభిమానంతో వినియోగం ప్రకారం విద్యుత్ విభజనను అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు. 

అలా బాబు అంగీకరించకపోయి ఉంటే తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా వచ్చిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు ఉదారత లేకుంటే, తెలంగాణ ప్రజలు ఎలా పోతే నాకెందుకు అనుకుని ఉంటే, విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 41 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 59 శాతం విద్యుత్ కేటాయింపు జరిగేదని, అప్పుడు మరింత నష్టం జరిగేదని ఆయన వివరించారు.

Posted

neat ga chepte no use...kcr la middle middle lo boothulu use cheste telangana vaallaki ardam avuthundi 2djomv.gif

Posted

neat ga chepte no use...kcr la middle middle lo boothulu use cheste telangana vaallaki ardam avuthundi 2djomv.gif

revanth reddy telangana drohi 2djomv.gif

Posted

neat ga chepte no use...kcr la middle middle lo boothulu use cheste telangana vaallaki ardam avuthundi 2djomv.gif

correstey..ninne a matter eee db chusaka ardham ayindhi2djomv.gif

Posted

విభజన సందర్భంగా ఆస్తులు, ఆప్పులు జనాభా ప్రాతిపదికన విభజించినా, విద్యుత్ కు కొత్త విధానం అమలు చేస్తే, సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై అభిమానంతో వినియోగం ప్రకారం విద్యుత్ విభజనను అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు.

అలా బాబు అంగీకరించకపోయి ఉంటే తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా వచ్చిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు ఉదారత లేకుంటే, తెలంగాణ ప్రజలు ఎలా పోతే నాకెందుకు అనుకుని ఉంటే, విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 41 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 59 శాతం విద్యుత్ కేటాయింపు జరిగేదని, అప్పుడు మరింత నష్టం జరిగేదని ఆయన వివరించారు.
 
e point pink panthers telsukovali...

appudu neeku pasupu rangu antisthaaru tappa, vesina matter right or wrong ani choodaru 2djomv.gif

Posted

appudu neeku pasupu rangu antisthaaru tappa, vesina matter right or wrong ani choodaru 2djomv.gif

2djomv.gif

Posted

విభజన సందర్భంగా ఆస్తులు, ఆప్పులు జనాభా ప్రాతిపదికన విభజించినా, విద్యుత్ కు కొత్త విధానం అమలు చేస్తే, సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై అభిమానంతో వినియోగం ప్రకారం విద్యుత్ విభజనను అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు.

అలా బాబు అంగీకరించకపోయి ఉంటే తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా వచ్చిందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాబుకు ఉదారత లేకుంటే, తెలంగాణ ప్రజలు ఎలా పోతే నాకెందుకు అనుకుని ఉంటే, విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 41 శాతం, ఆంధ్రప్రదేశ్ కు 59 శాతం విద్యుత్ కేటాయింపు జరిగేదని, అప్పుడు మరింత నష్టం జరిగేదని ఆయన వివరించారు.
 
e point pink panthers telsukovali...

calling killbill and ckravi

Posted

http://www.youtube.com/watch?v=ONy6xbsNm0I

 Vidi ardam gatha 12 years ga abadam chepaled ani ah?

Posted

 Vidi ardam gatha 12 years ga abadam chepaled ani ah?

anduke anedi...meeku and mee leaders ki mundu chupu ledu anedi...anduke venaka years gurinci talking....separate ayyaru kada...mee saavu meeru saavandi 2djomv.gif

Posted

Anduke tdp close avvali ani expecting pink panthers....kcr gadi sollu antha bayathaki vastundi ani...

Posted

Andhra meedha padde ediche fellas...memu 1400 cr petti buying mari enduku cheyaru....kakurthi lo kamandalam fellas...

×
×
  • Create New...