timmy Posted October 28, 2014 Report Posted October 28, 2014 మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను: జగన్ కు కొణతాల ఘాటు లేఖ 10:17 AM వైకాపా ఆవిర్భవించక ముందు నుంచి జగన్ వెన్నంటి ఉండి, పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేసిన నేత కొణతాల రామకృష్ణ. వైకాపా బలోపేతం కోసం నిర్విరామ కృషి చేసిన కొణతాల... ఇప్పుడు ఆ పార్టీనే వీడటానికి సిద్ధమయ్యారు. అంతేకాదు, అధినేత జగన్ కు ఘాటు లేఖను కూడా సంధించారు. "నా ఆత్మగౌరవంతో మీరు ఆడుకున్నారు. అడుగడుగునా అవమానించారు. మిమ్మల్ని తృప్తి పరచడం కోసం... మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను. ఇకపై మీరు చేసే అవమానాలను భరించలేను. అందుకే, మీరు నాకు ఇచ్చిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికీ మీరు సంతృప్తి చెందకపోతే... పార్టీని వీడటానికి కూడా వెనుకాడను. పార్టీ నాయకత్వానికి కార్యకర్తలపై నమ్మకం లేదు. ఇలా ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ పోతే... చివరకు మిమ్మల్ని మీరే అనుమానించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది" అంటూ లేఖలో తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొణతాలతో పాటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వీరంతా బీజేపీలో చేరుతారని సమాచారం.
StuartBinny Posted October 28, 2014 Report Posted October 28, 2014 వైఎస్సార్సీపీకి కొణతాల రామకృష్ణ రాజీనామా నువ్వెవరినీ నమ్మవు...నిన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కొణతాల ఘాటైన లేఖ హైదరాబాద్, అక్టోబర్ 28 : ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత కొంత కాలంగా పార్టీ అధినేత జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్న కొణతాల రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. అంతేకాకుండా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జగన్‌కు కొణతాల ఘాటైన లేఖ రాశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్ల�� � లేఖలో వెల్లడించారు. లేఖలో జగన్‌పై కొణతాల తీవ్ర ఆరోపణలు చేశారు. నువ్వెవరినీ నమ్మవు...నిన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జగన్‌నుద్దేశించి లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి తీవ్ర దోహం జరిగిందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులెవరూ వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. ఇకపై తనను ఎవరూ సంప్రదించవద్దని పార్టీ అగ్రనేతలకు కొణతాల స్పష్టం చేశారు. గండి బాబ్జీ వ్యవహారమే జగన్-కొణతాల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. కొణతాలకు సన్నిహితుడైన బాబ్జీని వారం క్రితం పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ పదవి నుంచి తప్పించారు. దాన్ని అవమానకరంగా భావించిన కొణతాల సన్నిహితుల దగ్గర తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేసినట్లు సమాచారం.
electionszindabad Posted October 28, 2014 Report Posted October 28, 2014 its been a while since I posted this..
dongakollu Posted October 28, 2014 Report Posted October 28, 2014 ante, jaggu iipusdu race gurrma lo sruthi hassan tyep lo, Manasukonne anni pettkuntada lol ante ga...nenu lopala chala bhayapadutunna kaani bayataki kanapadadu
ChandraSekharCherukuri Posted October 28, 2014 Report Posted October 28, 2014 lol ante ga...nenu lopala chala bhayapadutunna kaani bayataki kanapadadu
Recommended Posts