Jump to content

Recommended Posts

Posted
మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను: జగన్ కు కొణతాల ఘాటు లేఖ     10:17 AM
వైకాపా ఆవిర్భవించక ముందు నుంచి జగన్ వెన్నంటి ఉండి, పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేసిన నేత కొణతాల రామకృష్ణ. వైకాపా బలోపేతం కోసం నిర్విరామ కృషి చేసిన కొణతాల... ఇప్పుడు ఆ పార్టీనే వీడటానికి సిద్ధమయ్యారు. అంతేకాదు, అధినేత జగన్ కు ఘాటు లేఖను కూడా సంధించారు. 

"నా ఆత్మగౌరవంతో మీరు ఆడుకున్నారు. అడుగడుగునా అవమానించారు. మిమ్మల్ని తృప్తి పరచడం కోసం... మీ ఇంటి ముందు నిలబడే బానిసను కాలేను. ఇకపై మీరు చేసే అవమానాలను భరించలేను. అందుకే, మీరు నాకు ఇచ్చిన వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నా. ఇప్పటికీ మీరు సంతృప్తి చెందకపోతే... పార్టీని వీడటానికి కూడా వెనుకాడను. పార్టీ నాయకత్వానికి కార్యకర్తలపై నమ్మకం లేదు. ఇలా ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ పోతే... చివరకు మిమ్మల్ని మీరే అనుమానించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది" అంటూ లేఖలో తన ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొణతాలతో పాటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వీరంతా బీజేపీలో చేరుతారని సమాచారం.

 

Posted
వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ... పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు. తనను అడుగడుగునా అవమానిస్తున్నారని... తమ ఇంటి గేటు ముందు బానిసగా ఉండలేనని జగన్ కు కొణతాల ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్, తన సన్నిహితుడు గండి బాబ్జీని తప్పించడంతో కొణతాల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Posted
కొణతాల రామకృష్ణ ఇంకా తమ పార్టీనేతేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అంటున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, కొణతాల పార్టీ నుంచి వెళ్లిపోతారన్న విషయాన్ని తాను నమ్మడం లేదని చెప్పారు. 'పార్టీకి కొణతాల రాజీనామా' అని మీడియాలో మాత్రమే తాను చూశానని తెలిపారు. కానీ, దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పార్టీలో ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే టీ కప్పులో తుపానులా సమస్య తీరిపోతుందని పద్మ చెప్పారు.

 

×
×
  • Create New...