timmy Posted October 31, 2014 Report Posted October 31, 2014 నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరిగేది ఈ గ్రామాల్లోనే 02:05 PM ఆంధ్రప్రదేశ్ మొదటి దశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో జరగనుంది. దీని కోసం, ఈ గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నవ్యాంధ్ర రాజధానిగా అవతరించబోతున్న ఆ 17 గ్రామాలు ఇవే.. 1. వెలగపూడి 2. రాయిపూడి 3. దొండపాడు 4. అబ్బురాజుపాలెం 5. లింగాయపాలెం 6. మూఢలింగాయపాలెం 7. ఉద్దండరాయునిపాలెం 8. నెక్కల్లు 9. నీరుకొండ 10. శాఖమూరు 11. కూరగల్లు 12. మందడం 13. మొలకాపురం 14. నేలపాడు 15. తుళ్లూరు 16. నిడమర్రు 17. బోరుపాలెం
Ekambaram Posted October 31, 2014 Report Posted October 31, 2014 jaggay ippudu deeniki emantado?...pedala rajadhani kavali anandu..ippudu raithule labhapaduthunnaru... deeniki emantado?
timmy Posted October 31, 2014 Author Report Posted October 31, 2014 రాజధాని భూసేకరణ విషయంలో రైతులకు ఆందోళన వద్దు: యనమల 12:25 PM ఏపీ రాజధానికి భూమి సేకరించే విషయంలో వస్తున్న వదంతులపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ఏమైనా అపోహలు, ఆందోళనలు ఉంటే మంత్రివర్గం, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రైతులకు లాభసాటిగా ఉండే విధంగానే భూసేకరణ పాలసీ తయారుచేశామని మంత్రి తెలిపారు. రాజకీయ లబ్దికోసం కొందరు ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని అన్నారు.
Recommended Posts