Jump to content

Recommended Posts

Posted
 
విదేశాల్లోని నల్లధనంలోని ప్రతి పైసానూ రప్పిస్తాం: 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ    videoview.png 11:28 AM
ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం నల్లధనం అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రేడియో ప్రసంగంలో తొలుత స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన ప్రధాని, తమ చర్యతో ప్రస్తుతం ప్రతి వ్యక్తి సమాజం గురించి ఆలోచించే దిశగా పయనిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సైనికుల ధైర్య సాహసాలను కొనియాడిన మోదీ, దీపావళి సందర్భంగా వారితో గడిపిన సందర్భాన్ని నెమరువేసుకున్నారు.

నల్లధనంపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఈ విషయంలో సరైన దిశగానే పయనిస్తోందన్నారు. నల్లధనాన్ని దేశానికి రప్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని మోదీ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలపై తనకో లేఖ వచ్చిందన్న మోదీ, దానిపై వచ్చే నెలలో నిర్వహించే కార్యక్రమంలో మాట్లాడుకుందామని తెలిపారు. నల్లధనం విషయంలో ప్రజల సలహాలు, సూచనలు కోరుతున్నట్లు మోదీ ప్రకటించారు.

 

Posted
ఆ బ్యాంకుల్లోనే నల్లధనం మూలుగుతున్నట్టుంది!      06:39 PM
నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు అవకాశమున్న మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో సెబీ మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది. నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి మళ్లీ తరలిస్తున్నారని సెబీ గుర్తించింది. దీంతో ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించింది. 

రెండు స్విస్ బ్యాంకులు, ఒక యూరప్ బ్యాంక్ పై సెబీ ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తోంది. 15-20 భారతీయ కంపెనీలపై తమకు అనుమానముందని సెబీలో ఓ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. బ్లాక్ మనీ దర్యాప్తు కేసుతో స్విస్ బ్యాంకుల్లో ఆందోళన నెలకొంది. నల్లధనానికి సంబంధించి భారత్ తో ఒప్పందం చేసుకోవాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సెబీ విజ్ఞప్తి చేసింది.

 

Posted

Bokkem kadhu
Black Money medha decision motham court medha esi janalaki matiki Brahmi-2.gif

×
×
  • Create New...