Jump to content

Chavu Dappu


Recommended Posts

Posted

కేసీఆర్‌ వల్లే రైతుల సావుడప్పు మోత

 
 
  సర్కారు అసమర్థ విధానాలతోనే ఆత్మహత్యలు
 షరతుల్లేకుండా రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి
 ఏబీఎన్‌, టీవీ9పై బ్లాక్‌మెయిల్‌ రాజకీయం
 బంధువులకు కాంట్రాక్టు అప్పగించేందుకే..
కరెంటు కొనుగోళ్లలో జాప్యం
 నెపం మావోయిస్టులపై నెట్టే ప్రయత్నం
 కేసీఆర్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా 8న బంద్‌
 మావోయిస్టు పార్టీ పిలుపు.. మద్దతివ్వాలని విజ్ఞప్తి
 అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ప్రకటన 

హైదరాబాద్‌, నవంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు ఎజెండాను తమ ఎజెండాగా ప్రకటించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో వాక్‌, సభా, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నదని మావోయిస్టు పార్టీ మండిపడింది. రైతాంగ వ్యతిరేక విధానాలతో రైతుల ఆత్మహత్యలకు కారణమైందని దుయ్యబట్టింది. కేసీఆర్‌ నియంతృత్వ విధానాలకు నిరసనగా 8న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత పాలకులకు బుద్ది చెప్పిన ప్రజలు తప్పకుండా కేసీఆర్‌కూ బుద్ది చెబుతారని, తనకు ఎదురే లేదని విర్రవీగిన నియంతలెందరినో ప్రజలు కాలగర్భంలో కలిపారని చరిత్ర చెబుతోందన్నారు. మీడియా స్వేచ్ఛపై అప్రకటిత నిషేధాన్ని కొనసాగిస్తూ ఏబీఎన్‌, టీవీ9 చానళ్లను తన దారికి తెచ్చుకునేందుకు సీఎం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్‌ ప్రకటనలో ఆరోపించారు. ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచడానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, పోలీస్‌స్టేషన్ల ఆధునీకరణ, స్మార్ట్‌ సిటీ వంటి పేర్లతో పోలీస్‌ శాఖకు రూ.343 కోట్లు విడుదల చేశారని ఆక్షేపించారు. బంగారు, వజ్రాల తెలంగాణ అంటూ మాటల గారడీతో ప్రజల్ని మభ్య పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళజాతి కంపెనీల దోపిడీ కోసం మావోయిస్టు పార్టీపై నిషేధం విధిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా పోరాటాలపై నిర్భందం తీసుకొస్తోందన్నారు. మావోయిస్టు ఐక్య పార్టీ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ 21న తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభ జరక్కుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసిందని జగన్‌ విమర్శించారు. మావోయిస్టు పార్టీ అణచివేతకు కమెండో డాగ్స్‌కు నిధులు కేటాయించారని మండిపడ్డారు. రైతులకు కనీసం 3 గంటల విద్యుత్‌ అందించకుండా పాపాన్ని గత పాలకులపై నెడుతూ కేసీఆర్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోలో సాగుకు 9 గంటల కరెంటు ఇస్తానని ప్రకటించి, గద్దెనెక్కిన మరుక్షణమే కేసీఆర్‌.. కరెంట్‌ అడగవద్దంటూ సొంత జిల్లాలోనే రైతులపై లాఠీచార్జీ చేయించారని, గత పాలకుల బాటలోనే నడిచారని ఎద్దేవా చేశారు. పైగా మూడేళ్ల వరకూ కరెంట్‌ కష్టాలు ఇలాగే ఉంటాయంటూ ప్రకటనలు చేస్తూ, రైతులను మరింత మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, సావుడప్పుల మోతకు కారణమయ్యారని కేసీఆర్‌పై ఆరోపించారు. తన బంధువులకే కాంట్రాక్ట్‌ దక్కాలనే లక్ష్యంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంట్‌ కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని, ఆ నెపాన్ని మావోయిస్టు పార్టీ మీదికి నెట్టే ప్రయత్నం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 265 మందికి పైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారని వాపోయారు. వరుస రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, రైతు రుణాలను షరతులు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నియంతృత్వ విధానాలకు నిరసనగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక, కర్షక, మైనార్టీలు మావోయిస్టు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్‌ ప్రకటనలో కోరారు.

 

Posted

ప్రత్యేక రాష్ట్రం కోసం
మా ప్రాంతం లో
600 మంది
ఆత్మహత్యలు చేసుకొంటుంటే
ఆలోచించరా?
అని
ఆక్రోశించారు
మేధావులంతా!

ప్రత్యేక రాష్ట్రం వచ్చి
తము కోరుకున్న
ప్రభుత్వం వచ్చి
ప్రశాంతంగా
జీవించాల్సిన
ప్రజలు
పట్టుమని
నాలుగు మాసాలు కాక ముందే
భవిష్యత్ మీద బెంగ తో
300 రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటుంటే

కుహానా మేధావులకు
నోరు పెగలడం లేదు ఎందుకు

విద్యుత్ బాధలు వుంటాయి అని
ఈ ప్రాంత నాయకులు హెచ్చరిస్తే
హేళనగా మట్టాడి
నాలుకలు కోస్తాం అని హెచ్చరికలు చేసి

చత్తీస్ ఘడ్ నుండి
కొక్కేలు ఏసుకొని తెస్తా
మిగులు కరెంటు సాధిస్తాం అని
కోతలు కోసిన నాయకుడి
నాలుక తెగ్గోయరెందుకు

జనం చస్తున్నా
కచరా పాలన కుంటుతోందని
కుంటి సాకులు చెబుతోందని
కునుకుమీదన్న కుహానా మేధావులకు
అర్థం కావడం లేదా

వీళ్లకన్నా
కచరా నే నయం
ఆగని ప్రాణాలు చూసి
ఇన్నాళ్లకైనా చత్తీస్ ఘడ్
పయనం పెట్టుకొన్నాడు
తీరికగా నాలుగు మాసాల తరువాత
పార్టీలు మారే ఆయారాం గయారాం లతో గడుపుతున్న సమయం లో
తీరిక చేసుకొని

×
×
  • Create New...